English | Telugu
బాలయ్య వందలో బాబు ఎంట్రీ..!!
Updated : Jan 18, 2016
బాలయ్య బాబు కుమారుడు నందమూరి మోక్షజ్ఞ సినీ రంగ ప్రవేశం గురించి కొన్నాళ్లుగా వార్తలొస్తున్నాయి కానీ.. బాలయ్య మాత్రం నోరు విప్పలేదు. కానీ ఇప్పుడు మాత్రం బాలయ్య వందో సినిమా ఆదిత్య 369 సీక్వెల్ లో వారసుడి ఎంట్రీ కూడా ఉంటుందని ఫైనల్ అయిందట. ఆదిత్య 369 సీక్వెల్ లో మోక్షజ్ఞ నటిస్తున్నాడని ఈ మూవీతోనే అరంగేట్రం చేయించబోతున్నానని బాలయ్య చెప్పేశారట.ఒక పక్క డిక్టేటర్ హిట్టూ..మరో పక్కా బాలయ్య నటవారసుడి అరగ్రేటం ఫైనల్ కావడంతో ఫ్యాన్స్ సంబరాలు మొదలైపోగా.. మరో నెల రోజుల్లో ఈ మూవీ సెట్స్ పైకి వెళ్లే అవకాశాలు ఉన్నాయట. ఆదిత్య 369 సీక్వెల్ కి ఆదిత్య 999మాక్స్ అనే టైటిల్ పెట్టాలని భావిస్తున్నట్టు సమాచారం.