English | Telugu

ఎన్టీఆర్ ది అన్ స్టాపబుల్ అసెంట్.. దుబాయ్ వేదికగా వైరల్  

మాన్ ఆఫ్ మాసెస్ 'ఎన్టీఆర్'(Ntr)ఈ నెల 14 న హృతిక్ రోషన్(Hrithik Roshan)తో కలిసి 'వార్ 2'(War 2)తో వరల్డ్ వైడ్ గా ఉన్న థియేటర్స్ లో అడుగుపెడుతున్నాడు. గత సంవత్సరం సెప్టెంబర్ లో 'దేవర' తో వచ్చి బిగ్గెస్ట్ హిట్ ని అందుకోవడంతో' వార్ 2 'పై అభిమానులతో పాటు ప్రేక్షకుల్లోను భారీ అంచనాలు ఉన్నాయి. హృతిక్ ఇటీవల ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతు డాన్స్, యాక్టింగ్ పరంగా ఎన్టీఆర్ ఎలాంటి రిహార్సల్స్ లేకుండా చేసాడని, ఈ విషయంలో ఎన్టీఆర్ నుంచి చాలా నేర్చుకున్నానని చెప్పడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోతున్నాయి.

ఇక అంతర్జాతీయ మ్యాగజైన్ 'ఎస్కైర్'(Esquire)కి వరల్డ్ వైడ్ గా ఎంతో చరిత్ర ఉంది. ఈ మ్యాగజైన్ లో తమ ముఖ చిత్రం ప్రచురితం కావడాన్ని పలువురు సెలబ్రటీస్ ఎంతో గౌరవంగా భావిస్తారు.ఇప్పుడు ఈ మ్యాగజైన్ ఇండియా ఎడిషన్ కి సంబంధించి ఎన్టీఆర్ చిత్రాన్ని కవర్ పేజీగా ప్రచురించింది. 'ది సూపర్ స్టార్ జెట్స్ టూ దుబాయ్ ఫర్ హిజ్ ఫస్ట్ ఎవర్ మ్యాగజైన్ కవర్' అనే టాగ్ లైన్ తో పాటు 'ఎన్టీఆర్ ది అన్ స్టాపబుల్ అసెంట్' అనే టైటిల్ ని కూడా ఉంచింది. సదరు కవర్ ఫొటోలో ఎన్టీఆర్ దుబాయ్ డ్రెస్ స్టైల్ కి ప్రతీకగా నిలిచే లాల్చీ పైజామా ధరించి కళ్ళ జోడు పెట్టుకుని స్టైల్ గా కుర్చీలో కూర్చుకున్నాడు. బ్యాక్ గ్రౌండ్ లో దుబాయ్(Dubai)కి చెందిన పెద్ద పెద్ద భవంతులు కనిపిస్తున్నాయి. దీంతో ఈ పిక్ ఇప్పుడు అభిమానులని విశేషంగా ఆకర్షించడమే కాకుండా సోషల్ మీడియాలోను, రికార్డు వ్యూస్ తో ముందుకు దూసుకుపోతుంది.

'ఎస్క్వైర్' అనేది ఒక అమెరికన్ పురుషుల పత్రిక. ప్రస్తుతం యునైటెడ్ స్టేట్స్‌లో హర్స్ట్ ద్వారా ప్రచురితమవుతోంది. ఇరవైకి పైగానే అంతర్జాతీయ ఎడిషన్లు ఉన్నాయి.ప్రపంచ వ్యాప్తంగా పేరు గాంచిన సినీ, వ్యాపార,రాజకీయ ప్రముఖుల ముఖ చిత్రాలు 'ఎస్క్వైర్' లో ప్రచురితమయ్యాయి. 1933 లో స్థాపించబడిన 'ఎస్క్వైర్' వ్యక్తులకి సంబందించిన లోతైన విషయాలని తమ మ్యాగజైన్ లో పొందుపరుస్తుంది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.