English | Telugu

సోహెల్ తో పెళ్లి ఫోటోలు డిలీట్ చేసిన హన్సిక.. రంగంలోకి హిందూ ట్రస్ట్ కమిటీ హెడ్ ఆఫీసర్

చైల్డ్ ఆర్టిస్ట్ గా హిందీలోఎన్నో హిట్ చిత్రాల్లో నటించిన హన్సిక(Hansika Motwani)2007లో 'ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్'(Allu Arjun),దర్శకుడు పూరి జగన్నాధ్(Puri Jagannadh)ల కాంబినేషన్ లో వచ్చిన 'దేశముదురు' ద్వారా హీరోయిన్ గా తెరంగ్రేటమ్ చేసింది. మొదటి సినిమాతోనే బెస్ట్ డెబ్యూ ఫిమేల్ కేటగిరిలో ఫిలింఫేర్ అవార్డుని సొంతం చేసుకుంది. ఆ తర్వాత కంత్రి, బిల్లా, కందిరీగ, దేనికైనా రెడీ, పవర్ వంటి పలు చిత్రాల్లో నటించి అశేష అభిమానులని సొంతం చేసుకుంది. తమిళ, కన్నడ భాషల్లోను పలు చిత్రాల్లో నటిస్తు తన సత్తా చాటుతు వస్తుంది.

2022 లో 'సోహెల్ కౌట్రియ'(Sohael Khaturiya)అనే ఒక బిజినెస్ ఎంటర్ ప్యునర్ ని హన్సిక ప్రేమ వివాహం చేసుకుంది. ఈ వివాహంపై 'హన్సికాస్ లవ్ షాదీ డ్రామా' అనే పేరుతో వెబ్ సిరీస్ కూడా విడుదలవ్వగా, హన్సిక, సోహెల్ లే ప్రధాన పాత్రల్లో నటించారు. ప్రస్తుతం హన్సిక, సోహెల్ విడివిడిగా ఉంటున్నారని, త్వరలోనే విడాకులు కూడా తీసుకోబోతున్నారనే ప్రచారం కొన్ని రోజుల నుంచి జరుగుతుంది. సోహెల్ ఈ వార్తలని ఖండించాడు. హన్సిక మాత్రం ఎక్కడా స్పందించిన దాఖలాలు లేవు. రీసెంట్ గా హన్సిక సోషల్ మీడియా లో ఉన్న తమపెళ్లి ఫోటోలు డిలీట్ చేసింది. దీంతో విడాకుల వార్తలకి మరింత బలాన్ని చేకూర్చినట్టయ్యింది. హన్సిక కి కంటే ముందుకు సోహెల్ కి 2016 లో రింకీ అనే అమ్మాయితో వివాహం జరిగింది. ఆ తర్వాత ఇద్దరు విడాకులు తీసుకున్నారు.

కెరీర్ పరంగా చూసుకుంటే హన్సిక గత ఏడాది తమిళంలో తెరకెక్కిన హర్రర్ ఫిలిం 'గార్డియన్' తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రం తెలుగులో కూడా విడుదలై హన్సిక ని మంచి పేరు తీసుకొచ్చింది. ప్రస్తుతం 'శ్రీ గాంధారి'(Sri Gandhari)అనే మరో తమిళ హర్రర్ మూవీలో, డ్యూయల్ రోల్ లో తన సత్తా చాటడానికి సిద్దమవుతుంది. ఒక క్యారక్టర్ లో 'హిందూ ట్రస్ట్ కమిటీ హెడ్ ఆఫీసర్' గా కనిపించనుంది. షూటింగ్ దశలో ఉన్న ఈ మూవీ డిసెంబర్ లో విడుదల కాబోతుంది. ఇతర ప్రాజెక్ట్స్ కూడా చర్చల దశలో ఉన్నాయి.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .