English | Telugu

ఎన్టీఆర్‌... ప‌వ‌న్ స్టైల్ ఫాలోఅవుతున్నాడోచ్‌

ఈమ‌ధ్య ఫుల్లుగా గ‌డ్డం పెంచి.. అంద‌రికీ షాక్ ఇచ్చాడు ప‌వ‌న్ క‌ల్యాణ్‌. ప‌వ‌న్‌ని గుబురు గడ్డంలో చూసి `ప‌వ‌న్ బాబా వ‌చ్చాడు` అంటూ అంద‌రూ స‌ర‌దాగా కామెంట్లు చేశారు. బాహుబ‌లి సినిమాలో ఆఫ‌ర్‌గానీ వ‌చ్చిందా అంటూ కౌంట‌ర్లు కూడా వేసుకొన్నారు. రాబోయే సినిమాలో ప‌వ‌న్ ఈ గెట‌ప్‌తో కనిపించే అవ‌కాశాలున్నాయ‌ని ఓ నిర్దార‌ణ‌కు వ‌చ్చారు. ఇప్పుడు ప‌వ‌న్ స్టైల్‌ని ఎన్టీఆర్ కూడా అనుస‌రించేస్తున్నాడు. బుధ‌వారం జ‌రిగిన దాన‌వీర‌శూర‌క‌ర్ణ ఆడియో ఫంక్ష‌న్‌కి హాజ‌ర‌య్యాడు ఎన్టీఆర్‌. ఎప్పుడూ లేనిది ఈసారి ఫుల్లుగా గ‌డ్డం పెంచుకొని వ‌చ్చాడు. కొత్త గెట‌ప్‌లో ఎన్టీఆర్‌ని చూసి అంతా ఆశ్చ‌ర్య‌పోయారు. ఎన్టీఆర్ -సుకుమార్ కాంబినేష‌న్‌లో ఓ చిత్రం తెర‌కెక్క‌బోతోంది. అందుకోసం ఎన్టీఆర్ ఈ వెరైటీ గెట‌ప్ ట్రై చేస్తున్నాడ‌ని తెలుస్తోంది. ఈమధ్య సినిమా సినిమానీ త‌న గెట‌ప్‌లో ఛేంజ్ తీసుకురావాలని ఎన్టీఆర్ ప్ర‌య‌త్నిస్తున్నాడు. అందులో భాగంగానే ఇలా గెడ్డం పెంచాడ‌న్న‌మాట‌. అభిమానులు మాత్రం అప్పుడే ఎన్టీఆర్‌, ప‌వ‌న్‌ల గ‌డ్డంలో కూడా పోలిక‌లు, పోటీలూ మొద‌లెట్టేశారు. మ‌రింత‌కీ ఈ ఇద్ద‌రిలో గెడ్డం ఎవ‌రికి సూటైంది?? మీరే చెప్పాలి.

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.