English | Telugu

ఎన్టీఆర్ మ‌ళ్లీ ఖాకీ క‌డుతున్నాడోచ్‌..!



టెంప‌ర్‌లో ఎన్టీఆర్ పోలీస్ డ్ర‌స్సులో త‌న విశ్వ‌రూపం చూపించాడు. బాద్ షాలో కొన్ని సెక‌న్ల పాటు పోలీస్‌గా క‌నిపించి, త‌న ముచ్చ‌ట తీర్చుకొన్న ఎన్టీర్‌.. పూర్తిస్థాయిలో పోలీస్ అవ‌తారంలో ద‌ర్శ‌న‌మిచ్చింది మాత్రం టెంప‌ర్‌లోనే. అయితే ఇప్పుడు ముచ్చ‌ట‌గా మూడోసారి యూనిఫామ్ వేయ‌బోతున్నాడు ఎన్టీఆర్‌.

సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో 'నాన్న‌కు ప్రేమ‌తో' అనే చిత్రం ఇటీవ‌లే లండ‌న్‌లో మొదలైంది. ఇందులోనూ తార‌క్ పోలీస్ ఆఫీస‌ర్‌గానే క‌నిపించ‌నున్నాడ‌న్న‌ది లేటెస్ట్ టాక్‌. పోలీస్ అంటే అట్టాంటిట్టాంటి పోలీస్ కాదు.. ఎన్టీఆర్ ఓ ఇంట‌ర్ పోల్ ఆఫీస‌ర‌ట‌. సీక్రెట్‌గా.. దొంగ‌ల్ని ప‌ట్టేసుకొంటుంటాడ‌ట‌. బాద్‌షా, టెంప‌ర్‌.. ఇవి రెండూ ఎన్టీఆర్‌కి మంచి విజ‌యాల్ని అందించిపెట్టాయి. ఇప్పుడు అదే సెంటిమెంట్ ఈ సినిమా కూడా కొన‌సాగిస్తే.. పోలీసు పాత్ర‌ల‌కు తార‌క్ కేరాఫ్ అడ్ర‌స్స‌యిపోవ‌డం ఖాయం.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.