English | Telugu

బాహుబ‌లి దెబ్బ‌కు.. మ‌గ‌ధీర ఉష్ ప‌టాక్‌...!



అనుకొన్న‌దంతా అవుతోంది. బాహుబ‌లి దెబ్బ‌కు రికార్డుల‌న్నీ చల్లాచెదురైపోతున్నాయి. బాక్సాఫీసు ద‌గ్గ‌ర స‌రికొత్త రికార్డులు లిఖిస్తూ... ప్ర‌భాస్ - రాజ‌మౌళిల క్రేజీ చిత్రం `బాహుబ‌లి` దూసుకుపోతోంది. తొలి మూడు రోజుల్లోనే చాలా మ‌ట్టుకు రికార్డులు చెదిరిపోయాయి. ముఖ్యంగా `మ‌గ‌ధీర‌` రికార్డుల‌కు చెద‌లు ప‌ట్టింది. మ‌గ‌ధీర ప్ర‌పంచ వ్యాప్తంగా అన్ని రోజుల‌కూ క‌ల‌పి రూ.150 కోట్ల గ్రాస్‌ సాధించింది. దాన్ని కేవ‌లం మూడు రోజుల్లోనే అధిగ‌మించి మెగా ఫ్యాన్స్‌కి షాక్ ఇచ్చింది. శుక్ర‌, శ‌ని, ఆదివారాలు త‌న జోరు చూపించిన బాహుబ‌లి..

ప్ర‌పంచ వ్యాప్తంగా రూ.160 కోట్లు సాధించాడు. దాంతో చ‌ర‌ణ్ రికార్డు గ‌ల్లంత‌య్యింది. ఇక ప‌వ‌న్ క‌ల్యాణ్‌ ఇండ్ర‌స్ట్రీ రికార్డ్ `అత్తారింటికి దారేది`ని మాత్రం ఇప్పుడు మిగిలి ఉంది. తొలి వారంలో అత్తారింటికి దారేది రికార్డ్ కూడా చెదిరిపోవ‌డం ఖాయ‌మ‌ని ట్రేడ్ వ‌ర్గాలు చెబుతున్నాయి. టాలీవుడ్‌లో రూ.100 కోట్లు సృష్టించిన చిత్రం.. అత్తారింటికి దారేది. ఈ రికార్డును తొలి వారంలోనే `బాహుబ‌లి` అందుకోబోతోంది. మ‌రోవైపు బాలీవుడ్ రికార్డు చిత్రాలు పీకే, హ్యాపీ న్యూయిర్‌ల రికార్డులు కూడా బాహుబ‌లి ముందు బోసిబోతున్నాయి. ఈ హ‌వా ఎన్ని రోజులు కొన‌సాగుతుందో, ఇంకెవ‌రెవ‌రి రికార్డులు బ‌ద్ద‌ల‌వుతాయో చూడాలి.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.