English | Telugu

చిన్మయి పెళ్ళిలో కానుకలు వద్దంట

ఏదైనా వివాహం జరిగితే... వివాహానికి బహుమతులను తీసుకెళ్లడం అందరూ చేస్తారు. ఏదైనా గిఫ్టులను, పూల బొకేలను పెళ్లి జంటకు అందజేయడం అందరూ చేస్తుంటారు. కానీ చిన్మయి మాత్రం కొంచెం కొత్తగా, సమాజం కోసం ఆలోచిస్తుంది.

ఇంతకీ అసలు విషయం ఏమిటంటే... గాయకురాలు చిన్మయి అంటే తెలియని వాళ్ళుండరు. చిన్మయి వివాహం నటుడు రాహుల్ రవీంద్రన్ తో మే 6న జరగనుంది. వీరి వివాహం కోసం ఓ చారిటీ నిర్వహించనుంది. ఈ విషయం గురించి చిన్మయి తల్లి పద్మహాసిని మాట్లాడుతూ..."బొకేలు, గిఫ్టులు ఇస్తే ఆ పార్టీ అయ్యే వరకు మాత్రమే గుర్తుంటాయి. కానీ ఆ గిఫ్టులకు బదులుగా మీకు తోచినంత సహాయం చేస్తే.. మీరు ఓ మంచి పనికి సహకారం అందించిన వారవుతారు. అందుకే ఇన్విటేషన్ లో కూడా మేము దీని గురించి రిక్వెస్ట్ చేసి తెలియజేయడం జరిగింది" అని తెలిపారు. ఇంతకీ ఆ మంచి కార్యక్రమం ఏమిటంటే... లడక్ లో ఉన్న ఓ చారిటీకి మీరు సహాయం చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేసారు. అంటే.. "మాకు కానుకలు వద్దు. మీ సహాయం ఆ చారిటీకి ముద్దు" అనే భావనలో ఉన్నారు.