English | Telugu

ఓవర్సీస్ లో బాలయ్య సినిమాకు ఇంత క్రేజా..?

ఓవర్సీస్ ప్రేక్షకులకు క్లాస్ సినిమాలనే ఎక్కువ ప్రిఫర్ చేస్తుంటారు. హీరో ఒక్కడూ ముప్ఫై నలభై మందిని రఫ్పాండించేసే రియాలిటీ లేని సినిమాలను అక్కడి ప్రేక్షకులు ఆదరించరు. చక్కటి ఎమోషన్స్ ఉంటే సినిమాకు తిరుగుండదు. భలే భలే మగాడివోయ్, మనం, ఊపిరి లాంటి సినిమాలే అందుకు నిదర్శనం. కానీ బాలయ్య సినిమాల్లో భారీ యాక్షన్ సీక్వెన్సెస్, భీభత్సమైన డైలాగ్స్ ప్రధానంగా ఉంటాయి. ఈ కారణం వల్లే బాలకృష్ణకు పెద్దగా ఓవర్సీస్ మార్కెట్ లేదు. కానీ ఆ ట్రెండ్ ను మార్చేసింది నటసింహం వందో సినిమా శాతకర్ణి. ఈ సినిమా ప్రారంభోత్సవం ఇండస్ట్రీ దిగ్గజాల మధ్య అట్టహాసంగా జరిగిన సంగతి తెలిసిందే. టైటిల్ డిజైన్ కూడా అందరి దృష్టినీ ఆకర్షించింది.

క్లీన్ సినిమాలు తీసే క్రిష్ శాతకర్ణి డైరెక్టర్ కావడంతో, ఇండస్ట్రీలో శాతకర్ణికి మంచి అంచనాలే ఉన్నాయి. ఇవే అంచనాలు ఇప్పుడు యుఎస్ మార్కెట్ లో కూడా ఫలితాన్ని చూపిస్తున్నాయి. నార్త్ అమెరికాకు చెందిన ఎబ్సల్యూట్ తెలుగు సినిమాస్ అనే సంస్థ, శాతకర్ణి రైట్స్ ను మూడు కోట్ల భారీ మొత్తాన్ని చెల్లించి సొంతం చేసుకుందని సమాచారం. బాలయ్య సినిమాకు ఓవర్సీస్ లో ఈ రేంజ్ లో రేట్ పలకడం ఇదే మొదటిసారి. దీంతో షూటింగ్ మొదలుకాక ముందే, శాతకర్ణి యూనిట్ అంతా ఫుల్ ఖుషీగా ఉంది. శాతకర్ణి తల్లి గౌతమి పాత్రకు బాలీవుడ్ డ్రీమ్ గర్ల్ హేమమాలిని తీసుకోగా, హీరోయిన్ గా నయనతార లేదా ఇలియానాను సంప్రదిస్తున్నారని సమాచారం. క్రిష్ సొంత ప్రొడక్షన్ హౌస్ నిర్మిస్తున్న ఈ సినిమాకు, దేవీ శ్రీ ప్రసాద్ స్వరాల్ని అందిస్తుండటం విశేషం.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.