English | Telugu
నితిన్ అతనికి అన్యాయం చేశాడు
Updated : Dec 26, 2014
గురువారం విడుదలైన చిన్నదాన నీకోసం ఫ్లాప్ టాక్ మూటగట్టుకొంది. కరుణాకరన్‌కి ఇక ఛాన్సులు ఇచ్చే ఛాన్సే లేదని విశ్లేషకులు కూడా తేల్చేస్తున్నారు. ఆయన డైరెక్షన్ ఆ రేంజులో ఉంది మరి. అయితే... చిన్నదాన ఫ్లాప్ వెనుక కరుణాకరన్ చేసిందేం లేదట. ఎందుకంటే కరుణాకరన్‌ని పక్కన పెట్టి నితిన్, ఆండ్రూ, హర్షవర్థన్ ఈ ముగ్గురూ కలసి డైరెక్షన్ చేసేసుకొన్నార్ట. కరుణాకరన్ ఆలోచనలకు అస్సలు ఎవ్వరూ వాల్యూ ఇవ్వలేదని, కనీసం ఆయన్ని డైరెక్టర్ గా కూడా చూడలేదని ఇన్ సైడ్ టాక్. అందుకే మీడియాని ఇంటర్వ్యూకు పిలిచిన కరుణాకరన్ అక్కడేం మాట్లాడలేదట. మీడియావాళ్లు ఎన్ని ప్రశ్నలు వేసినా కరుణాకరన్ సమాధానం చెప్పలేదట. `సినిమా చూడండి.. ఆ తరవాత మాట్లాడుకొందాం..` అని సున్నితంగా తప్పించుకొన్నాడట. ఈ సినిమా కరుణాకరన్ కెరీర్‌కి చాలా ముఖ్యం, హిట్టయితేనే మరో అవకాశం వచ్చేది. డూ ఆర్ డై సెట్యువేషన్‌లో ఉన్న దర్శకుడితో నితిన్ ఆడుకొన్నాడని, అసలు డైరెక్షన్ చేసే ఛాన్సే ఇవ్వలేదని తెలుస్తోంది. అంత నమ్మకం లేనప్పుడు మరి కరుణాకరన్‌ని ఎందుకు తీసుకొన్నట్టో. చిన్నదానా నీ కోసం ఫ్లాప్ వల్ల నితిన్‌కి అర్జెంటుగా వచ్చిన నష్టం ఏమీ లేదు. కానీ కరుణాకరన్ కెరీర్‌కి దాదాపుగా శుభం కార్డు పడిపోయినట్టే.