English | Telugu
సూపర్ స్టార్ కి అప్పులేంటి?
Updated : Dec 26, 2014
దక్షిణాదిన అత్యధిక పారితోషికం తీసుకొంటున్న నటుడు ఎవరంటే సూపర్ స్టార్ రజనీకాంత్ పేరే చెబుతారు. ప్రపంచ వ్యాప్తంగా ఆయనకు లెక్కలేనంతమంది అభిమానులున్నారు. రజనీ సినిమా అంటే బాక్సాఫీసుకి పండగే. లింగ కోసం దాదాపుగా రూ.50 కోట్ల పారితోషికం అందుకొన్నాడని టాక్ వినిపించింది. ఇలాంటి రజనీకాంత్ అప్పుల్లో ఉన్నాడంటే నమ్ముతారా..?? కానీ ఇది నిజం. తమిళనాడుకు చెందిన ఎక్షిమ్ బ్యాంక్‌లో రజనీకాంత్ తన ఆస్తుల్ని తనఖా పెట్టి రూ.22 కోట్లు అప్పుగా తీసుకొన్నాడట. బ్యాంక్ ఎన్నిసార్లు నోటీసులు పంపినా.. రజనీ స్పందించలేదని తెలిసింది. వాయిదాలు కూడా చెల్లించకపోవడంతో రజనీ ఆస్తుల్ని వేలం వేస్తున్నట్టు ఆ బ్యాంక్ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ వార్త వినగానే రజనీ అభిమానులంతా షాక్ కి గురయ్యారు. ఎలాగైనా రజనీ ఆస్తుల వేలం ఆపాలని కొంతమంది నిర్ణయించుకొన్నార్ట. చివరికి ఏమవుతుందో చూడాలి.