English | Telugu

తమ్ముడు మొదటి రోజు కలెక్షన్స్ ఇవే!

నితిన్(Nithiin)దిల్ రాజు(Dil Raju), వేణు శ్రీరామ్(Venu Sriram)కాంబోలో నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చిన మూవీ 'తమ్ముడు'(Thammudu). యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీలో నితిన్ కి ఒకప్పటి సీనియర్ హీరోయిన్ లయ సోదరిగా నటించగా సప్తమి గౌడ, వర్ష బొల్లమ్మ, శ్వాసిక విజయ్, సౌరభ్ సచ్ దేవ్, హరిత కీలక పాత్రలు పోషించారు. అజనీష్ లోక్ నాధ్ సంగీతాన్ని అందించాడు.

తమ్ముడు మూవీ మొదటి రోజు రెండు కోట్ల రూపాయల నెట్ కలెక్షన్స్ ని సాధించినట్టుగా వార్తలు వస్తున్నాయి. దీంతో మరోసారి నితిన్ తన కెరీర్ లో మొదటి రోజు అతి తక్కువ కలెక్షన్స్ ని అందుకున్నాడు. నితిన్ గత చిత్రం 'రాబిన్ హుడ్' కూడా తొలి రోజు 2 కోట్ల రూపాయిల నెట్ కలెక్షన్స్ ని వసూలు చేసినట్టుగా ప్రచారం జరిగిన విషయం తెలిసిందే.

తమ్ముడు మూవీ చూసిన చాలా మంది ప్రేక్షకులు పలు మీడియా సంస్థలతో మాట్లాడుతు కథ కథనాలు, దర్శకత్వం, మాటలు ఇలా అన్ని విభాగాల్లోను తమ్ముడు ఫెయిల్ అయ్యిందని, నితిన్ తో పాటు మిగతా నటి నటులు పెర్ ఫార్మెన్స్ పరంగా బాగా చేశారనే అభిప్రాయాన్ని వెల్లడి చేస్తున్నారు.



అఖండ 2 ఆగినప్పుడు తెరవెనుక ఉంది వీళ్లే.. గంగాధర శాస్త్రి చెప్పిన పచ్చి నిజాలు  

నందమూరి నటసింహం గాడ్ ఆఫ్ మాసెస్ 'బాలకృష్ణ'(Balakrishana)పాన్ ఇండియా సిల్వర్ స్క్రీన్ వద్ద 'అఖండ 2'(Akhanda 2)తో కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ ని అందుకున్నాడు. దీంతో హిట్ ల శాతం తక్కువగా ఉన్న ప్రస్తుత సినీ యుగంలో వరుసగా ఐదు విజయాలని అందుకున్న హీరోగా  చరిత్రనే సృషించాడు . కలెక్షన్స్ పరంగా కూడా అఖండ 2 తొలి రోజు వరల్డ్ వైడ్ గా ప్రీమియర్స్ తో కలుపుకొని 59 .5 కోట్ల రూపాయిల గ్రాస్ ని అందుకోవడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోతున్నాయి. మేకర్స్ కూడా త్వరలోనే రెండు తెలుగు రాష్టాల్లో సక్సెస్ సెలబ్రేషన్స్ ని జరుపుతున్నారు.

Akhanda 2: ఫస్ట్ డే రికార్డు కలెక్షన్స్ 

గాడ్ ఆఫ్ మాసెస్ 'బాలకృష్ణ'(Balakrishna)మరోసారి సిల్వర్ స్క్రీన్ పై 'అఖండ 2'(Akhanda 2)తో తన సత్తాని చాలా స్పష్టంగా చాటుతున్నాడు. ప్రీమియర్స్ నుంచే ఫ్యాన్స్ తో పాటు మూవీ లవర్స్ భారీగా థియేటర్స్ కి పోటెత్తారు. దీంతో రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు వరల్డ్ వైడ్ గా అఖండ 2 థియేటర్స్ దగ్గర పండుగ వాతావరణం కనిపించింది. మూవీ చూసిన అభిమానులు, ప్రేక్షకులు స్పందిస్తు 'అఖండ క్యారక్టర్ లో బాలయ్య తన కళ్ళతోనే క్యారక్టర్ యొక్క స్వరూపాన్ని ప్రదర్శించాడు. దీంతో మరోసారి బాలయ్య నట విశ్వరూపాన్నిచూసే అవకాశం లభించింది. బోయపాటి(Boyapati Srinu)బాలయ్య కాంబో మరో సారి మెస్మరైజ్ చేసిందని ముక్త కంఠంతో చెప్తున్నారు. దీంతో తొలి రోజు బాలకృష్ణ రికార్డు కలెక్షన్స్ ని తన ఖాతాలో వేసుకున్నాడు.