English | Telugu

ఆడియో డేట్ ఫిక్స్ చేసిన మెగా హీరోయిన్..

మెగా హీరోయిన్ నిహారిక కొణిదెల, నాగశౌర్య నటించిన "ఒక మనసు" సినిమా గురించి ఇండస్ట్రీతో పాటు మెగా అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా ఆడియో డేట్‌ను రిలీజ్ చేసింది నిహారిక. ఈ నెల 18న ఒక మనసు ఆడియోను హైదరాబాద్ శిల్పకళా వేదికలో గ్రాండ్‌గా రిలీజ్ చేస్తున్నట్టు నిహారిక తన ఫేస్‌బుక్ ఖాతా ద్వారా ప్రకటించారు. ఈ సందర్భంగా మూవీ కొత్త పోస్టర్‌ను ఆమె అభిమానులతో పంచుకున్నారు. మల్లెల తీరంలో సిరిమల్లె పువ్వు ఫేమ్ రామరాజు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా...టీవీ9తో కలిసి మధుర శ్రీధర్‌రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.