English | Telugu

24 సినిమాకు ప్రీక్వెల్ రెడీ అయిపోయిందట..!

అతి కష్టమైన సబ్జెక్ట్స్ ను తీసుకుని చాలా సింపుల్ గా చూపించడంలో విక్రమ్ కె కుమార్ ది ప్రత్యేకమైన శైలి. బి 24, మనం, లేటెస్ట్ గా 24 , ఇవన్నీ కూడా చాలా కష్టమైన స్క్రీన్ ప్లే కలిగిన సినిమాలు. కానీ వాటిని చాలా ఈజీగా, అందరికీ అర్ధమయ్యేలా మూవీని తీయడంలో విక్రమ్ ఎక్స్ పర్ట్. సూర్యతో తీసిన సైఫై సినిమా 24 ఇప్పుడు అన్ని చోట్ల సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతోంది. చాలా కొత్తగా తెరకెక్కించి ఆడియన్స్ ను అట్రాక్ట్ చేయడంలో సక్సెస్ అయ్యాడు దర్శకుడు. సినిమా రిలీజ్ కు ముందే, హిట్టైతే ప్రీక్వెల్ లేదా సీక్వెల్ తీస్తానని ప్రకటించాడు విక్రమ్ కె కుమార్.

ప్రస్తుతం వచ్చిన హిట్ టాక్ తో, ప్రీక్వెల్ కు స్టోరీ లైన్ ను కూడా రెడీ చేసేశాడట. 24 సినిమా ఆత్రేయ వాచ్ కోసం ప్రయత్నించడం తో మొదలవుతుంది. అయితే ఆత్రేయ శివకుమార్ ను వాచ్ కోసం ఎందుకు బెదిరిస్తున్నాడు అనేది మాత్రం సినిమాలో చెప్పలేదు. దీన్ని బేస్ చేసుకుని, ప్రీక్వెల్ తీయబోతున్నాడట విక్రమ్. ఇప్పటికే పూర్తి స్టోరీ లైన్ ను రెడీ చేసేశానని, మరో ఏడాదిలోనే ఈ సినిమాను తెరకెక్కిస్తానని చెబుతున్నాడు. చాలా మంది దర్శకుల్లా ఏదో ఒక జానర్ కు బేస్ అవకుండా, లవ్, థ్రిల్లర్, సైఫై ఇలా అన్నింటినీ టచ్ చేస్తూ వెళ్లడం విక్రమ్ కె కుమార్ ప్రత్యేకత. మరి ప్రీక్వెల్ ఎలా ఉంటుందో వేచి చూడాలి.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .