English | Telugu

రిసార్ట్ లో కల్పిక.. ఆ వీడియోలో ఏముంది!

ఐకాన్ స్టార్ 'అల్లుఅర్జున్(Allu Arjun),త్రివిక్రమ్'(Trivikram)కాంబినేషన్ లో వచ్చిన మూవీ 'జులాయి'. ఈ మూవీలో 'రాజేంద్రప్రసాద్' కూతురుగా, అల్లుఅర్జున్ కి లైన్ వేసే క్యారక్టర్ లో నటించి ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు పొందిన నటి 'కల్పిక గణేష్'(Kalpika Ganesh). ఆరెంజ్, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు వంటి చిత్రాలు కూడా ఆమె లిస్ట్ లో ఉన్నాయి. కొన్ని రోజుల క్రితం హైదరాబాద్ లోని ఒక పబ్ లో బర్త్ డే కేక్ విషయంలో 'కల్పిక' పబ్ సిబ్బందిని నానా దుర్భాషలాడింది. అందుకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

రీసెంట్ గా కల్పిక హైదరాబాద్‌(Hyderabad)సమీపంలోని 'మొయినాబాద్' ప్రాంతంలో ఉన్న 'బ్రౌన్ టౌన్'(Broun Town)రిసార్ట్‌కి మధ్యాహ్నం మూడు గంటల సమయంలో క్యాబ్‌లో వెళ్ళింది. రిసెప్షన్‌లో అడుగు పెట్టగానే మేనేజర్ పై దురుసుగా ప్రవర్తిస్తు మెనూ కార్డుని, రూమ్ కీస్‌ ని మేనేజర్ ముఖంపై విసిరింది. అసభ్యంగా బూతులు కూడా తిట్టింది. ఈ వీడీయో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.

ఈ విషయంపై కల్పిక ఒక వీడియో రిలీజ్ చేసింది. అందులో ఆమె మాట్లాడుతు తాను సిగరెట్స్ కావాలని అడిగితే మేనేజర్ తో పాటు సిబ్బంది దురుసుగా ప్రవర్తించారు. రిసార్ట్ లో సెల్ ఫోన్ సిగ్నల్స్ లేవు. క్యాబ్ బుక్ చేసుకోవడానికి వైఫై లేదు. వీటి గురించి అడిగితేనే మేనేజర్ గొడవకి దిగాడు. దీంతో నేను కూడా గొడవకి దిగానని కల్పిక చెప్పుకొచ్చింది. సోషల్ మీడియాలో కల్పిక కి పెద్ద ఎత్తున ఫాలోవర్స్ ఉన్నారు. రాబోయే బిగ్ బాస్ సీజన్ 9 లో కల్పిక కంటెస్ట్ గా ఉండబోతుందనే ప్రచారం జరుగుతుంది.

రూమర్స్ కి చెక్.. ఉస్తాద్ భగత్ సింగ్ గురించి మొత్తం చెప్పేసింది

సిల్వర్ స్క్రీన్ పై పవర్ స్టార్ 'పవన్ కళ్యాణ్'(Pawan Kalyan)స్టామినాని మరింతగా ఎలివేట్ చెయ్యబోతున్న చిత్రం 'ఉస్తాద్ భగత్ సింగ్'(Ustaad.ఇప్పటి వరకు రిలీజైన ప్రచార చిత్రాల ద్వారా ఆ విషయం అర్ధమవుతుండటంతో పాటు దర్శకుడు హరీష్ శంకర్ కూడా ఆ విషయంలో అభిమానులకి, ఫ్యాన్స్ కి పూర్తి భరోసాని ఇస్తున్నాడు. వచ్చే ఏడాది వేసవికి థియేటర్స్ లో అడుగుపెట్టే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ సినిమా గురించి ప్రముఖ హీరోయిన్ సాక్షి వైద్య చెప్పిన కొన్ని విషయాల ద్వారా ఎప్పట్నుంచో సినీ సర్కిల్స్ లో దర్జాగా చక్కర్లు కొడుతున్న ఒక పుకారు కి  పుల్ స్టాప్ పడినట్లయింది.