English | Telugu
చివరి రోజుల్లో ఫిష్ వెంకట్ పడిన ఇబ్బందులు
Updated : Jul 19, 2025
తెలుగు సినీ పరిశ్రమను వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. లెజెండరీ యాక్టర్స్ కోట శ్రీనివాసరావు(Kota srinivasarao),బి. సరోజాదేవి(B. Sarojadevi)మరణించిన సంఘటనలు మరువక ముందే, రీసెంట్ గా మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ కామెడీ నటుడు, విలన్ 'ఫిష్ వెంకట్'(Fish Venkat)నిన్న కన్నుమూశారు.
ఫిష్ వెంకట్ కొంతకాలంగా కిడ్నీ సంబంధిత సమస్యతో బాధపడుతున్నాడు. ఈ క్రమంలో రెండు కిడ్నీలు పాడైపోవడంతో ఆరోగ్యం బాగా క్షీణించింది. దీంతో హైదరాబాద్ బోడుప్పల్ లోని ఒక ప్రవైట్ హాస్పిటల్ లో ట్రీట్ మెంట్ తీసుకుంటున్నాడు. ఆ సమయంలో ఫిష్ వెంకట్ తో పాటు ఆయన భార్య మీడియాతో మాట్లాడుతు కిడ్ని మార్చాలంటే సుమారు యాభై లక్షల దాకా అవుతుందని డాక్టర్స్ చెప్తున్నారు. ఈ విషయంలోఆర్ధికంగా తమని ఆదుకోవాలని కోరడం జరిగింది. అప్పట్నుంచి ఫిష్ వెంకట్ ఆరోగ్యం పట్ల భార్యతో పాటు కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతూనే వస్తున్నారు. కానీ ఇంతలోనే 'ఫిష్ వెంకట్' మరణించడం జరిగింది. దీంతో ఎన్నో సినిమాల్లో చేసిన వ్యక్తి తనకి సాయం చేయమని భార్యతో కలిసి వేడుకోవడం, ఆ తర్వాత కొన్ని రోజులకే చనిపోవడంతో పలువురిని కంటతడి పెట్టిస్తుంది.
ఫిష్ వెంకట్ అసలు పేరు మంగిలంపల్లి వెంకటేష్. మొదట్లో ముషీరాబాద్‌లో చేపల వ్యాపారం చెయ్యడంతో 'ఫిష్ వెంకట్' అనే పేరు స్థిరపడిపోయింది. ఆ పేరుతోనే 2000 వ సంవత్సరంలో సినీ రంగంలోకి ప్రవేశించి, దాదాపు వంద సినిమాల దాకా నటించాడు. ఎన్టీఆర్(Ntr),వివి వినాయక్(VV Vinayak)కాంబోలో వచ్చిన 'ఆది' ఫిష్ వెంకట్ కి ప్రత్యేక గుర్తింపుని తీసుకురావడంతో
పాటు మరిన్ని సినిమాల్లో తన సత్తా చాటేలా చేసింది.