English | Telugu
ఫోన్ వాడితే డ్రగ్స్ ఫ్రీ!.. మలయాళ నటి
Updated : Jul 19, 2025
వాస్తవికతకి దగ్గరగా ఉండే సినిమాలు నిర్మించడంలో మలయాళ చిత్ర పరిశ్రమ ముందు వరుసలో ఉంటుందని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఈ కోవలోనే మత్తు పదార్ధాలకి అలవాటు పడితే ఎంత ప్రమాదమో, సెల్ ఫోన్ కి బానిస అయితే అంతే ప్రమాదం అనే కాన్సెప్ట్ తో 'ఈ వలయం'(E Valayam)అనే చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది. గత నెల 13 న రిలీజవ్వగా మహిళా దర్శకురాలు 'రేవతి'(Revathi)తెరకెక్కించగా, 'జోబీ జాయ్'(Jobi Joy)నిర్మాతగా వ్యవహరించడం జరిగింది.
రీసెంట్ గా 'జోబీ జాయ్' మాట్లాడుతు 'ఈ వలయం' మూవీని తెలుగుతో పాటు తమిళ, కన్నడ భాషల్లోకి అనువాదం చేయబోతున్నాం. నేటి విద్యార్థులు, యువత సెల్ ఫోన్ కి ఏ విధంగా బానిసలుగా మారుతున్నారో అని మా చిత్రంలో చెప్పడం జరిగింది. ప్రేక్షకులకి వినోదంతో పాటు మంచి మెసేజ్ ఇచ్చినందుకు ఎంతో సంతృప్తిగా ఉందని చెప్పుకొచ్చాడు. మత్తు పదార్ధాలకి అలవాటు పడితే ఎంత ప్రమాదమో, సెల్ ఫోన్ ఎక్కువ వాడితే అంతే ప్రమాదమంటు తీర్చి దిద్హిన కథనాలు సినిమాలో హైలెట్ గా నిలిచాయి.
'ఈ వలయం' లో సెల్ ఫోన్ లేకుండా క్షణం కూడా గడపలేని 'నేలి' అనే యువతిగా 'యాష్లీ ఉష'(Ashly Usha)చాలా అద్భుతంగా నటించింది. ఆ సమయంలో ఆమె ఎదుర్కునే సమస్యలతో పాటు సెల్ ఫోన్ లేకపోతే వచ్చే 'నోమో ఫోబియా' అనే అరుదైన వ్యాధి గురించి మూవీలో చర్చించారు. మిగతా పాత్రల్లో రెంజి ఫణిక్కర్, ముత్తుమని, నందు, షాలు రహీమ్ తదితరులు కనిపించగా జెర్రీ అమల్దేవ్ సంగీతాన్ని అందించాడు.