English | Telugu

ముంబైలోని చారిత్రాత్మక గుహ తెలుసుగా..మంచు మనోజ్ మామూలోడు కాదు 

'హనుమాన్'(Hanumaan)మూవీతో పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ ని సంపాదించిన 'తేజ సజ్జ'(Teja Sajja)ప్రస్తుతం 'మిరాయ్'(Mirai)అనే మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. విభిన్న కథాంశంతో తెరకెక్కుతున్న ఈ మూవీలో 'మంచు మనోజ్'(Manchu Manoj)ప్రతినాయకుడిగా చేస్తున్నాడు. మనోజ్ పుట్టినరోజు సందర్భంగా ఇటీవల రిలీజ్ చేసిన గ్లింప్స్ లో సాలిడ్ యాక్షన్ లుక్ లో కత్తి పట్టుకొని 'ది బ్లాక్ స్వార్డ్' గా మనోజ్ కనిపిస్తుండటంతో మూవీపై అందరిలో ఆసక్తి మరింత పెరిగింది.

చిత్రీకరణ దశలో ఉన్న ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం ముంబై(Mumbai)లోని చారిత్రాత్మక గుహలలో జరుగుతుంది. ఈ కొత్త షెడ్యూల్ లో తేజ సజ్జ తో పాటు, కొంతమంది ప్రధాన క్యారక్టర్ ల మధ్య కొన్ని కీలక సన్నివేశాలని చిత్రీకరించబోతున్నారు. హనుమాన్ తర్వాత వస్తున్న ఈ మూవీపై తేజ సజ్జ, మనోజ్ అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.

'ఈగల్' మూవీ ఫేమ్ కార్తీక్ ఘట్టమనేని(karthik Gattamaneni)దర్శకత్వంలో తెరకెక్కుతున్న'మిరాయ్' లో రితికా నాయక్ (Ritika Nayak)హీరోయిన్ గా చేస్తుంది. పాన్ ఇండియా నటులు స్క్రీన్ షేర్ చేసుకుంటున్న ఈ చిత్రానికి గౌర హరీష్ సంగీతాన్ని అందిస్తున్నాడు. టెక్నీకల్ గా కూడా ఉన్నత ప్రమాణాలతో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టి జె విశ్వప్రసాద్(TJ Viswaprasad) నిర్మిస్తున్నాడు. ఆగస్టు 1 న రిలీజ్ అవుతుందని అధికారకంగా ప్రకటించారు.

రూమర్స్ కి చెక్.. ఉస్తాద్ భగత్ సింగ్ గురించి మొత్తం చెప్పేసింది

సిల్వర్ స్క్రీన్ పై పవర్ స్టార్ 'పవన్ కళ్యాణ్'(Pawan Kalyan)స్టామినాని మరింతగా ఎలివేట్ చెయ్యబోతున్న చిత్రం 'ఉస్తాద్ భగత్ సింగ్'(Ustaad.ఇప్పటి వరకు రిలీజైన ప్రచార చిత్రాల ద్వారా ఆ విషయం అర్ధమవుతుండటంతో పాటు దర్శకుడు హరీష్ శంకర్ కూడా ఆ విషయంలో అభిమానులకి, ఫ్యాన్స్ కి పూర్తి భరోసాని ఇస్తున్నాడు. వచ్చే ఏడాది వేసవికి థియేటర్స్ లో అడుగుపెట్టే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ సినిమా గురించి ప్రముఖ హీరోయిన్ సాక్షి వైద్య చెప్పిన కొన్ని విషయాల ద్వారా ఎప్పట్నుంచో సినీ సర్కిల్స్ లో దర్జాగా చక్కర్లు కొడుతున్న ఒక పుకారు కి  పుల్ స్టాప్ పడినట్లయింది.