English | Telugu

రానా నాయుడు సీజన్ 2 రిలీజ్ డేట్ ఇదే.. రొమాన్స్  విషయంలో తగ్గేదేలే!  

విక్టరీ వెంకటేష్(Venkatesh)రానా(Rana)ప్రధాన పాత్రల్లో 2023 వ సంవత్సరంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన వెబ్ సిరీస్ 'రానా నాయుడు'(Rana Naidu). యాక్షన్ క్రైమ్ డ్రామాగా తెరకెక్కిన ఈ సిరీస్ 'రెడోనోవన్' అనే అమెరికన్ టీవీ సిరీస్ కి రీమేక్ గా తెరకెక్కింది. వెంకటేష్,రానా విజృంభించి నటించిన ఈ సిరీస్ లో సుశాంత్ సింగ్, అభిషేక్ బెనర్జీ, సుచిత్ర పిళ్ళై, సర్వీన్ చావ్లా, గౌరవ్ చోప్రా తదితరులు కీలక పాత్రల్లో కనిపించారు.

ఇప్పుడు ఈ సిరీస్ కి కొనసాగింపుగా రూపొందిన 'రానా నాయుడు సీజన్ 2 (Rana Naidu Season 2)జూన్ 13 నుంచి నెట్ ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని మేకర్స్ తో పాటు నెట్ ఫ్లిక్స్ కూడా అధికారకంగా ప్రకటించింది. దీంతో రానా నాయుడు సీజన్ 2 కోసం ఎదురుచూస్తున్న వెంకటేష్, రానా అభిమానుల్లో సరికొత్త జోష్ వచ్చిందని చెప్పవచ్చు. సీజన్ 2 లో మొదటి సీజన్ లో నటించిన వాళ్ళతో పాటు అర్జున్ రాంపాల్,కృతి ఖర్బందా వంటి యాక్ట్రెస్ కూడా జత కలిశారు.

మొదటి సీజన్ లో కొన్ని డైలాగులు, సన్నివేశాలు ద్వందార్ధలతో కూడుకొని అసభ్యకరంగా ఉన్నాయనే విమర్శలు వచ్చిన నేపథ్యంలో సీజన్ 2 ఎలా ఉండబోతుందనే ఆసక్తి అందరిలో ఏర్పడింది. కరణ్ అన్షుమాన్, సుపర్న్ ఎస్. వర్మ, అభయ్ చోప్రాలు సంయుక్తంగా దర్శకత్వం వహించగా,లోకోమోటివ్ గ్లోబల్ మీడియా పతాకంపై సుందర్ ఆరోన్ నిర్మించాడు.



Dominic And The Ladies Purse Review: డొమినిక్ అండ్ ద లేడీస్ పర్స్ మూవీ రివ్యూ

సి.ఐ డొమినిక్ (మమ్ముట్టి) ప్రైవేట్ డిటెక్టివ్ గా చేస్తుంటాడు. అతడు గతంలో పోలీస్ ఆఫీసర్. ఇక అతనికి సహాయంగా ఉండేందుకు ఒక వ్యక్తి కావాలంటూ డొమినిక్ పేపర్ లో ప్రకటన ఇస్తాడు. దాంతో విక్కీ (గోకుల్ సురేశ్) అతడికి అసిస్టెంట్ గా  జాయిన్ అవుతాడు. ఒకరోజు డొమినిక్ ఉండే ఇంటి ఓనర్ మాధురి (విజీ వెంకటేశ్) అతని దగ్గరికి వచ్చి.. తను జనరల్ హాస్పిటల్ కి వెళ్లినప్పుడు ఒక 'పర్స్' దొరికిందని చెప్పి ఇస్తుంది. ఆ పర్స్ ఎవరిదో తెలుసుకుని వాళ్లకి అందజేయమని చెప్తుంది. దాంతో ఆ పర్స్ ఎవరిదో తెలుసుకునే పనిలో పడతాడు డొమినిక్. ఆ పర్స్ పూజ (మీనాక్షి ఉన్నికృష్ణన్) అనే యువతికి చెందినదని తెలుసుకుంటాడు. అయితే ఆ పర్స్ పారేసుకున్న రోజు నుంచి ఆమె మిస్సింగ్ అని తెలిసి షాక్ అవుతాడు...