English | Telugu

అల్లు వారి వేడుకలో జగన్ మావయ్య...

అల్లు శిరీష్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ 'బడ్డీ'. ఈ చిత్ర ట్రైలర్ విడుదల కార్యక్రమం హైదరాబాద్ లోని ఏఏఏ సినిమాస్ లో మంగళవారం సాయంత్రం జరిగింది. అయితే ఈ వేడుకలో ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది.

'బడ్డీ' చిత్రంలో 'రంగం' ఫేమ్ అజ్మల్ అమీర్ కూడా నటించాడు. ఈ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కి ఆయన కూడా హాజరయ్యాడు. ఈ సందర్భంగా వేదికపై మాట్లాడదామని అజ్మల్ మైక్ పట్టుకోగానే.. అక్కడున్న ఆడియన్స్ ఒక్కసారిగా ''జగన్ మావయ్య.. జగన్ మావయ్య" అంటూ కేకలు వేశారు. మొదట ఆడియన్స్ ఏమన్నారో అర్థంగాక మళ్ళీ అడిగిన అజ్మల్.. ఆ తరువాత ఏమన్నారో అర్థమై "జగనన్ననా.. ప్రమాణం చేస్తున్నాను" అంటూ వైఎస్ జగన్ ని ఇమిటేట్ చేసి గట్టిగా నవ్వేశాడు.

కాగా, దర్శకుడు రామ్ గోపాల్ వర్మ రూపొందించిన 'అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు', 'వ్యూహం' వంటి సినిమాల్లో ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ పాత్రలో అజ్మల్ నటించిన విషయం తెలిసిందే. అందుకే అజ్మల్ ని చూడగానే ఆడియన్స్ "జగన్ మావయ్య" అని అరిచారు.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.