English | Telugu

డబ్బుల్లేవు.. ప్లీజ్ హెల్ప్ మీ.. హీరో సంచలన వీడియో!

తాను నటించిన సినిమా బాగుంటుంది, థియేటర్లో తమ సినిమాని చూసి ఆదరించండి అంటూ విడుదలకు ముందు ప్రేక్షకులను కోరే హీరోలను చూస్తుంటాం. కానీ సినిమా ప్రమోషన్స్ కి డబ్బుల్లేవు, విడుదలకు సాయం చేయండని ప్రేక్షకులను డబ్బులు అడిగిన హీరోని ఎప్పుడైనా చూశారా?. తాజాగా ఓ హీరో అదే పని చేశాడు.

వినోద్‌ కిషన్‌, అనూష కృష్ణ జంటగా నీలగిరి మామిళ్ల దర్శకత్వంలో రాజేష్ వర్రే నిర్మించిన చిత్రం 'పేక మేడలు'. అయితే ఈ చిత్ర హీరో వినోద్‌ కిషన్‌ తాజాగా విడుదల చేసిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. "అందరికీ నమస్కారం. నా పేరు వినోద్‌ కిషన్‌. 'నా పేరు శివ', 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' సినిమాల్లో నెగటివ్ రోల్స్ చేశాను. ఇప్పుడు ఫస్ట్ టైం హీరోగా 'పేక మేడలు' అనే చిత్రం చేశాను. సినిమా చాలా బాగా వచ్చింది. సినిమా పట్ల మేము చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాము. కానీ ప్రమోషన్స్ కి డబ్బులు లేవు. ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి, మీకు తోచినంత సాయం చేయండి. ఖచ్చితంగా ఈ సినిమా బాగా ఆడి డబ్బులొస్తాయి. అప్పుడు వడ్డీతో సహా మీ డబ్బులను తిరిగి ఇస్తాము." అంటూ ఆ వీడియోలో చెప్పుకొచ్చాడు.

రూమర్స్ కి చెక్.. ఉస్తాద్ భగత్ సింగ్ గురించి మొత్తం చెప్పేసింది

సిల్వర్ స్క్రీన్ పై పవర్ స్టార్ 'పవన్ కళ్యాణ్'(Pawan Kalyan)స్టామినాని మరింతగా ఎలివేట్ చెయ్యబోతున్న చిత్రం 'ఉస్తాద్ భగత్ సింగ్'(Ustaad.ఇప్పటి వరకు రిలీజైన ప్రచార చిత్రాల ద్వారా ఆ విషయం అర్ధమవుతుండటంతో పాటు దర్శకుడు హరీష్ శంకర్ కూడా ఆ విషయంలో అభిమానులకి, ఫ్యాన్స్ కి పూర్తి భరోసాని ఇస్తున్నాడు. వచ్చే ఏడాది వేసవికి థియేటర్స్ లో అడుగుపెట్టే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ సినిమా గురించి ప్రముఖ హీరోయిన్ సాక్షి వైద్య చెప్పిన కొన్ని విషయాల ద్వారా ఎప్పట్నుంచో సినీ సర్కిల్స్ లో దర్జాగా చక్కర్లు కొడుతున్న ఒక పుకారు కి  పుల్ స్టాప్ పడినట్లయింది.