English | Telugu

కమల్ హాసన్ కి వార్నింగ్ ఇచ్చిన రెబల్ స్టార్!

ప్రభాస్ (Prabhas) హీరోగా నటించిన 'కల్కి 2898 AD' (kalki 2898 AD) సినిమాలో కమల్ హాసన్ (Kamal Haasan) కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. అయితే ప్రభాస్ పెదనాన్న, రెబల్ స్టార్ కృష్ణంరాజు (Krishnam Raju) అప్పట్లో కమల్ హాసన్ కి వార్నింగ్ ఇచ్చారట. ఈ విషయాన్ని స్వయంగా కమల్ రివీల్ చేశారు.

కృష్ణంరాజు హీరోగా నటించిన ఓ సినిమాకి కమల్ హాసన్ డ్యాన్స్ అసిస్టెంట్ గా పని చేశారు. అయితే ఆ సమయంలో కష్టమైన స్టెప్పు ఇవ్వొద్దని కమల్ కి కృష్ణంరాజు చెప్పేవారట. అంతేకాదు, ఓ సారి కష్టమైన స్టెప్స్ ఇస్తే నీ సంగతి చూస్తా అంటూ సరదాగా వార్నింగ్ కూడా ఇచ్చారట. ఈ విషయాన్ని 'కల్కి' ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో కమల్ చేసుకున్నారు.

నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతి మూవీస్ నిర్మించిన 'కల్కి'లో ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొనే తదితరులు నటించారు. ఈ చిత్రం జూన్ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది.

రూమర్స్ కి చెక్.. ఉస్తాద్ భగత్ సింగ్ గురించి మొత్తం చెప్పేసింది

సిల్వర్ స్క్రీన్ పై పవర్ స్టార్ 'పవన్ కళ్యాణ్'(Pawan Kalyan)స్టామినాని మరింతగా ఎలివేట్ చెయ్యబోతున్న చిత్రం 'ఉస్తాద్ భగత్ సింగ్'(Ustaad.ఇప్పటి వరకు రిలీజైన ప్రచార చిత్రాల ద్వారా ఆ విషయం అర్ధమవుతుండటంతో పాటు దర్శకుడు హరీష్ శంకర్ కూడా ఆ విషయంలో అభిమానులకి, ఫ్యాన్స్ కి పూర్తి భరోసాని ఇస్తున్నాడు. వచ్చే ఏడాది వేసవికి థియేటర్స్ లో అడుగుపెట్టే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ సినిమా గురించి ప్రముఖ హీరోయిన్ సాక్షి వైద్య చెప్పిన కొన్ని విషయాల ద్వారా ఎప్పట్నుంచో సినీ సర్కిల్స్ లో దర్జాగా చక్కర్లు కొడుతున్న ఒక పుకారు కి  పుల్ స్టాప్ పడినట్లయింది.