English | Telugu

చైతూ సినిమాకి కొత్త టైటిల్

స్వామి రారా తో ఆక‌ట్టుకొన్నాడు సుధీర్ వ‌ర్మ‌. త‌క్కువ బ‌డ్జెట్‌లో క్వాలిటీ, కంటెంట్ ఉన్న సినిమా తీసి అగ్ర క‌థానాయ‌కులు దృష్టిలో ప‌డ్డాడు. వెంట‌నే అన్న‌పూర్ణ స్టూడియోస్ నుంచి ఆఫ‌ర్ వ‌చ్చింది. దాంతో నాగ‌చైత‌న్య సినిమా ప‌ట్టాలెక్కింది. ఇది కూడా క్రైమ్ కామెడీ థ్రిల్ల‌రే. షూటింగ్ దాదాపుగా పూర్త‌యింది. ఈనెల 23 న చైతూ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా టైటిల్‌, ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ విడుద‌ల చేయ‌నున్నారు. మాయ‌గాడు, దొర‌క‌డు అనే పేర్లు ప‌రిశీలించారు. ఇప్పుడు మ‌రో పేరు వెలుగులోకి వ‌చ్చింది. అదే... హ‌రిలో రంగ హ‌రి. ఈసినిమాలోని చైతూ పాత్ర చిత్ర‌ణ‌కీ, క‌థ‌కీ ఈ టైటిల్ యాప్ట్ అని చిత్ర‌బృందం భావిస్తోందట. నాగ్ స‌ల‌హా కూడా తీసుకొని ఈ టైటిల్‌ని అధికారికంగా ప్ర‌క‌టించాల‌నుకొంటున్నారు. ఈ నెల 23న టైటిల్ ఎనౌన్స్ చేసే అవ‌కాశం ఉంది. డిసెంబ‌రు చివ‌రి వారంలో సినిమాని విడుద‌ల చేస్తారు.