English | Telugu

మెగా ఫ్యామిలీని కలిసిన నెట్‌ఫ్లిక్స్‌ సీఈఓ.. రీజన్‌ అదేనా?

ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన నెట్‌ఫ్లిక్స్‌ గురించి అందరికీ తెలిసిందే. హాలీవుడ్‌ నుంచి టాలీవుడ్‌ వరకు అన్ని భాషా చిత్రాలకు నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా నిలుస్తోంది. ఈ సంస్థ సీఈవో టెడ్‌ సరాండోస్‌ డిసెంబర్‌ 7న హైదరాబాద్‌ వచ్చారు. టెడ్‌ సరాండోస్‌ వెంట నెట్‌ఫ్లిక్స్‌ ప్రతినిధులు కూడా వచ్చారు. వీరంతా సరాసరి మెగాస్టార్‌ చిరంజీవి నివాసానికి వెళ్లారు. చిరంజీవి, రామ్‌చరణ్‌లను కలుసుకున్నారు. మెగా ఫ్యామిలీ హీరోలు టెడ్‌కుసాదర స్వాగతం పలికారు. అందరూ కాసేపు ముచ్చటించుకున్నారు.

టెడ్‌ సరాండోస్‌ వచ్చిన సమయంలో మెగా మేనల్లుడు సాయిధరమ్‌ తేజ్‌, ఆయన తమ్ముడు పంజా వైష్ణవ్‌ తేజ్‌, నిర్మాత శోభు యార్లగడ్డతోపాటు చరణ్‌ మిత్రుడు, నిర్మాత విక్రమ్‌ కూడా ఉన్నారు. ఈ సమావేశం అనంతరం అందరూ గ్రూప్‌ ఫోటోలు, సెల్ఫీలు దిగారు. అయితే నెట్‌ఫ్లిక్స్‌ ప్రతినిధులు మెగా ఫ్యామిలీని కలవడం వెనుక ఆంతర్యం ఏమిటనేది తెలియరాలేదు. గతంలో రామ్‌చరణ్‌ నెట్‌ఫ్లిక్స్‌ కోసం ఓ వెబ్‌ సిరీస్‌ చెయ్యబోతున్నాడనే వార్తలు వచ్చాయి. అయితే దానికి సంబంధించి ఆ తర్వాత ఎటువంటి అప్‌డేట్‌ లేదు. ఒకవేళ ఆ విషయమై నెట్‌ఫ్లిక్స్‌ ప్రతినిధులు మెగా ఫ్యామిలీని కలిసి ఉంటారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.