Read more!

English | Telugu

జిఫ్ ద్వారా నేను-నా రాక్షసి ఓవర్ సీస్ రిలీజ్

జిఫ్ ద్వారా నేను-నా రాక్షసి ఓవర్ సీస్ రిలీజ్ చేయబడుతుందని విశ్వసనీయ వర్గాల ద్వారా అందిన సమాచారం. జిఫ్ అంటే జి.ఐ. ఎఫ్. గ్రేట్ ఇండియా ఫిలింస్ అని అర్థం. వివరాల్లోకి వెళితే శ్రీ లక్ష్మీ నరసింహా ప్రొడక్షన్స్ పతాకంపై, మూవీ మొగల్ డాక్టర్ డి.రామానాయుడు గారి మనవడు రానా హీరోగా, నలకనడుము గోవా భామ ఇలియానా హీరోయిన్ గా, డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో, నల్లమలపు శ్రీనివాస్ (బుజ్జి) నిర్మిస్తున్న చిత్రం"నేను-నా రాక్షసి". "నేను-నా రాక్షసి" చిత్రం ఏప్రెల్ 29 న విడుదల కానుంది.

"నేను-నా రాక్షసి" మూవీని ఓవర్ సీస్ లో జిఫ్ ద్వారా రిలీజ్ చేస్తున్నారు. "నేను-నా రాక్షసి" మూవీలో హీరో రానా ఒక ప్రొఫెషనల్ కిల్లర్ గా నటిస్తూండగా, ఇలియానా అతని గడుసు ప్రేయసిగా నటిస్తూందట. "నేను-నా రాక్షసి" సినిమాలో ముమైత్ ఖాన్ ఒక విభిన్నమైన కామెడీ పాత్రలో నటిస్తుందని ఫిలిం నగర్ వర్గాల కథనం. పూరీ జగన్నాథ్ సినిమా అనగానే కమెడియన్ ఆలీ పాత్ర ఏమిటాని ప్రేక్షకులకు ఒక విధమైన ఉత్సుకత ఉంటుంది. ప్రేక్షకుల అంచనాలకు తగ్గట్టే ఆలీ పాత్ర ఉంటుందని దర్శకులు పూరీ జగన్నాథ్ అంటున్నారు.

 

ఈ చిత్రానికి ముగ్గురు సంగీత దర్శకులు సంగీతం అందించిన ఆడియో ఇటీవలే విడుదలై ప్రేక్షకుల ఆదరణతో సక్సస్ అయ్యింది. "లీడర్" తర్వాత రానా నటించిన రెండవ తెలుగు చిత్రం "నేను-నా రాక్షసి" మూవీ గనక ఈ సినిమా మీద భారీ అంచనాలున్నాయి.