English | Telugu

దర్శకరత్న చేతుల మీదగా 'నేనొస్తా' ఫస్ట్ లుక్ రిలీజ్

'నేనొస్తా' చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్, టైటిల్‌ లోగోను దర్శకరత్న డా.దాసరి నారాయణరావు గారు రిలీజ్ చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. టైటిల్‌ మరియు లోగో చాలా బాగుందని, కొత్త వాళ్లు చేస్తున్న ఈ ప్రయత్నం విజయవంతం కావాలని ఆశీస్పులు అందజేశారు. జ్ఞాన్‌, సూర్య శ్రీనివాస్‌ హీరోలుగా నటిస్తున్న ఈ సినిమాలో ఒక రొమాంటిక్‌ ప్రేమకథ ఫేం ప్రియాంక పల్లవి హీరోయిన్‌గా నటిస్తోంది. పరంధ్‌ కళ్యాణ్‌ దర్శకత్వంలో రైజింగ్‌ డ్రీమ్స్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై రైజింగ్‌ టీమ్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఈ సినిమా దర్శకనిర్మాతలు మాట్లాడుతూ.. మా చిత్రం లోగోను దర్శక దిగ్గజం ఆవిష్కరించడం చాలా సంతోషంగా ఉంది. ఈ సందర్భంగా ఆయనకు కృతజ్ఞతలు. ఇదొక థ్రిల్లర్‌ సినిమా. ఆద్యంతం ప్రేక్షకులను కచ్చితంగా అలరిస్తుందని మా నమ్మకం. హైదరాబాద్‌, వికారాబాద్‌, నర్సాపూర్‌, వైజాగ్‌, జడ్చర్ల తదితర అందమైన లొకేషన్లలో నలభై రోజుల పాటు క్వాలిటీకి వెనకాడకుండా హై స్టాండార్డ్స్‌లో చిత్రాన్ని పూర్తి చేశాము. ఇందులో ఐదు పాటలున్నాయి.

బాహుబలి సిస్టర్స్‌ మౌనిమ, దామిని పాడిన పాట హైలెట్‌గా నిలుస్తుంది. పాటలన్నీ చిత్రీకరణ పూర్తయ్యాయి. ప్రస్తుతం రామానాయుడు స్టూడియోలో నిర్మాణానంతర కార్యక్రమాలు జురుపుకుంటోంది. త్వరలో ట్రైలర్‌ని లాంచ్‌ చేస్తాము' అన్నారు.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.