English | Telugu

ఇంత‌లో ఎంత మార్పు

న‌న్ను చూడాలంటే సినిమాల్లోనే చూడాలి.. యాడ్స్‌, ప్ర‌మోష‌న్స్ నా ఒంటికి స‌రిప‌డ‌వంతే.. అంటూ ద‌శాబ్ద‌కాలంగా స్టేట్‌మెంట్స్ ఇస్తూ వ‌చ్చింది కేర‌ళ కుట్టి న‌య‌న‌తార‌. అయితే ఇదంతా ఒక‌ప్ప‌టి మాట‌. ఎందుకంటే.. ఇప్పుడిప్పుడే న‌య‌న‌లోనూ కొన్ని మార్పులు చోటుచేసుకుంటున్నాయి మ‌రి. ఆడ‌పాద‌డ‌పా సినిమా ప్ర‌మోష‌న్స్‌కు అటెండ్ అవుతోంది. అంతేకాకుండా ఎప్పుడూ లేని విధంగా ఈ స‌న్న‌జాజి సోయ‌గం కొత్త‌గా యాడ్స్‌లోనూ క‌నువిందు చేస్తోంది. తాజాగా.. జి.ఆర్‌.టి.జ్యూవెల‌ర్స్ కోసం న‌య‌న‌తార వివిధ భంగిమ‌ల్లో ద‌ర్శ‌న‌మిస్తూ త‌న అభిమానుల్లో మ‌రింత హుషారు పుట్టించే ప్ర‌య‌త్నం చేయ‌డ‌మే ఇందుకు నిద‌ర్శ‌నం. న‌య‌న వైనం చూసి ఇంత‌లో ఎంత మార్పు అంటూ తోటి తార‌లు బుగ్గ‌లు నొక్కుకుంటున్నారు.