English | Telugu
అల్లు అర్జున్ మూవీలో నయనతార?
Updated : Aug 16, 2014
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందనున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకి సంబంధించి రోజుకో వార్త హల్ చల్ చేస్తోంది. ఇటీవల ఈ చిత్రంలో యాక్షన్ కింగ్ అర్జున్ విలన్ గా నటించబోతున్నాడనే వార్త వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా ఈసినిమాలో ఓ ప్రత్యేక పాత్ర కోసం నయనతారని తీసుకున్నట్టుగా ఇండస్ట్రీ వర్గాల సమాచారం. ఈ ప్రాజెక్ట్ లో అల్లుఅర్జున్ సరసన ముగ్గురు హీరోయిన్స్ నటించబోతున్నారు. వీరిలో ఒక హీరోయిన్ గా సమంత ఎంపిక చేశారు. మరో ఇద్దరినీ ఎంపిక చేయాల్సి వుంది. నయనతార చేయబోయే పాత్ర గురించి బయటికి రివీల్ చేయకూడదని త్రివిక్రమ్ తన యూనిట్ కి చెప్పినట్లు సమాచారం. హారిక హాసిని క్రియేషన్స్ పతాకంపై తెరకెక్కబోతున్న ఈ సినిమాకి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించబోతున్నారు.