English | Telugu

సూర్యకి షాకిచ్చిన కామెడీయన్..!

టాలీవుడ్ భారీ అంచనాలతో నిన్న విడుదలైన ‘సికిందర్’ అన్నిటినీ తలకిందులు చేసి బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తాపడినట్లు సమాచారం. ఇరు రాష్ట్రాలలోను 400ల ధియేటర్లకు పైగా రిలీజైన ‘సికిందర్’కి, ఆన్ లైన్ అడ్వాన్స్ బుకింగ్ కు అదే రెంజులో రెస్పాన్స్ రావడంతో నిర్మాతలు సంబరపడ్డారు. కానీ మొదటి రోజే ఫ్లాప్ టాక్ తెచ్చుకోవడంతో రెండవ రోజు కలెక్షన్లు నిరసించాయి. కానీ అదే రోజు రిలీజైన తెలుగు సినిమా 'లవర్స్ యావరేజ్ టాక్ తెచ్చుకున్న సినిమాలో మంచి కామెడీ వుండడంతో ప్రేక్షకులు తెగ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ క్రెడిట్ అంతా కామెడియన్ 'సప్తగిరి'కి ఇస్తున్నారు సినీ విమర్శకులు. ఇప్పుడు ఆమె సినిమాకు అతనే హీరోగా మారిపోయాడు. ప్రస్తుతం టాలీవుడ్ మరో రెండు వారాలు చెప్పుకోతగ్గ సినిమాలు లేకపోవడంతో 'సప్తగిరి' నిర్మాతలకు కాసుల వర్షం కురిపిస్తాడని విశ్లేషకులు అంటున్నారు. దీంతో టాప్ లో దూసుకెల్తాడని భావించిన ‘సికిందర్’కి కామెడియన్ 'సప్తగిరి' ఝలక్ ఇచ్చాడని ఫిల్మ్ నగర్ లో చర్చించుకుంటున్నారు.

అవతార్ 3 ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే.. ఇండియాలో మాత్రం ఆ సినిమా దెబ్బకొట్టిందా!

జేమ్స్ కామెరూన్ నుంచి వచ్చిన మరో అద్భుత సృష్టి 'అవతార్ ఫైర్ అండ్ యాష్' నిన్న వరల్డ్ వైడ్ గా కనివిని ఎరుగని రీతిలో అత్యధిక థియేటర్స్ లో విడుదలైంది.ఒక్క ఇండియాలోనే అన్ని లాంగ్వేజెస్ లో కలిపి 5200 షోస్ ని ప్రదర్శించారంటే ఏ స్థాయిలో రిలీజ్ అయ్యిందో అర్ధం చేసుకోవచ్చు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు పెద్ద ఎత్తున థియేటర్స్ కి  పోటెత్తడంతో అన్ని చోట్ల హౌస్ ఫుల్ బోర్డ్స్ దర్శనమిచ్చాయి. తెలుగు రాష్ట్రాలతో సహా ఇండియా మొత్తం ఇంచుమించు అదే పరిస్థితి. దీంతో తొలి రోజు  అవతార్ ముంగిట భారీ కలెక్షన్స్ వచ్చి చేరాయి.