English | Telugu
నయనతార సన్యాసం తీసుకొంటుందా..??
Updated : Jan 9, 2015
చిత్రసీమకు ఇంత కంటే షాకింగ్‌న్యూస్ ఉంటుందా..?? నయన తార సన్యాసం తీసుకోబోతోందట. త్వరలోనే సినిమాలకు దూరంగా ప్రశాంతమైన జీవితం గడపడానికి నయన్ నిర్ణయించుకొందని, అందుకు సన్యాసినిగా మారడమే మార్గమని నయన భావిస్తున్నట్టు అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం. ప్రేమలో ఇప్పటికే రెండు సార్లు దారుణంగా విఫలమైంది నయనతార. శింబు ప్రేమలో పీకల్లోతు మునిగిన నయనకు... తొలి షాక్ తగిలింది. అందులోంచి తేరుకోగానే ప్రభుదేవా రూపంలో మరో ప్రేమికుడు లభించాడు. ప్రభుదేవాతో దాదాపుగా పెళ్లిఖాయమనుకొన్నారు. కానీ.. ప్రభు కూడా హ్యాండిచ్చేశాడు. ఆర్యతో కొంతకాలం సన్నిహితంగా మెలిగింది. కానీ ఆ ప్రేమ కథ కూడా ఫ్లాప్ అయ్యింది. గత కొంతకాలంగా నయన డిప్రెషన్‌లో ఉందని, సినిమాలకు త్వరగా కటీఫ్ ఇచ్చేసి ప్రశాంతమైన జీవినం గడపాలని చూస్తోందని ఆమె సన్నిహితులు చెబుతున్నారు. ఈమధ్య భక్తి భావాలనూ బాగానే పెంపొందించుకొంటోందట. మొన్నామధ్య నయన హిమాలయాలకు కూడా వెళ్లిందని, అక్కడ కొంతమంది స్వామీజీలను కలుసుకొందని చెబుతున్నారు. నయన మనసులో సన్యాసం పుచ్చుకోవాలన్న కోరిక బలంగా నాటుకు పోయిందని, త్వరలోనే ఆమె ఆ మార్గంవైపు అడుగు వేయడం ఖాయమని నయన గురించి బాగా తెల్సినవాళ్లు చెబుతున్నారు. మరి నయనతార మనసులో ఏముందో..??