English | Telugu
గోపాల గోపాల సెన్సార్ రిపోర్ట్
Updated : Jan 9, 2015
గత రెండురోజులుగా పవన్ కళ్యాణ్ అభిమానులు పడుతున్న టెన్షన్ తీరిపోయింది. ఈ సంక్రాంతికి రిలీజవుతుందా లేదా అనుకున్న గోపాల గోపాల మూవీ సెన్సార్ కార్యక్రమాలు పూర్తిచేసుకోవడంతో మూవీ రిలీజ్ మార్గం సుగమమైంది. ఈ సినిమాకి సెన్సార్ బోర్డు అధికారులు క్లీన్ యు సర్టిఫికెట్ ను జారీ చేశారు. మూవీ రన్ టైమ్ 150నిమిషాలు అని సమాచారం. హిందీ సినిమా ఓ మై గాడ్ కు రీమేక్ అయిన గోపాల గోపాల సినిమాలో పవన్ కళ్యాణ్, వెంకటేష్ ఇద్దరూ నటిస్తున్నారు. డాలీ దర్శకుడు. అనూప్ సంగీతం అందించారు. పవన్ అభిమానులను, వెంకీ అభిమానులను అలరించడానికి 10న గోపాల గోపాల రాబోతోంది.