English | Telugu

పాపం ఆ తారకు నోటీసులిచ్చారు

సినిమా చేయడానికి కోట్లకు కోట్లు రెమ్యున్ రేషన్ అడగటంలో వెనుకాడని హీరోయిన్ నయనతారకు పాపం ఇంటి పన్ను కట్టడానికి డబ్పులు లేవేమో. ఇంటి పన్ను కట్టనందుకు నయనతారకు ఊటీ కార్పోరేషన్ అధికారులు ఇంటివాటర్, డ్రైనేజ్ కనెక్షన్లు కట్ చేస్తున్నట్లు నోటీసులు జారీ చేశారు. నీలగిరి జిల్లా ఊటీ సమీపంలో లవ్ టెల్ రోడ్డు రాయల్ కాస్టిల్ ప్రాంతంలో నయనతారకు ఇల్లు ఉంది. కాని ఈ అమ్మడు చాలా కాలం నుండి ఇంటి పన్నునే కట్టడం లేదట. దీంతో ఊటీ కార్పోరేషన్ అధికారులు నయనతార ఇంటికి తాళం వేసి జప్తు నోటీసులు అతికించారు.

హిందువులపై కాజల్ కీలక వ్యాఖ్యలు.. వైరల్ అవుతున్న పోస్ట్ 

అగ్ర హీరోయిన్ గా తెలుగు చిత్ర సీమని ఏలిన నటి కాజల్(Kajal). ఏలడమే కాదు దాదాపుగా అందరి అగ్ర హీరోలతో జతకట్టి తెలుగు చిత్రసీమలో తనకంటు ఒక అధ్యాయాన్ని సృష్టించుకుంది. పెర్ఫార్మ్ ఓరియెంటెడ్ నటిగా కూడా ఎన్నో చిత్రాల ద్వారా నిరూపించుకున్న కాజల్ పెళ్లి తర్వాత నటనకి దూరమవుతుందని అందరు అనుకున్నారు. కానీ ఆమె తన నట ప్రస్థానాన్ని కొనసాగిస్తు ఈ సంవత్సరం జూన్ 7 న 'సత్యభామ' అనే హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీతో మెస్మరైజ్ చేసింది. ప్రస్తుతం బంగ్లాదేశ్ దేశంలో కొంత మంది అరాచక శక్తులు హిందువులు లక్ష్యంగా దాడులు చేస్తున్న విషయం తెలిసిందే.