English | Telugu
కాజల్ కాస్త తగ్గించింది గురూ..
Updated : Mar 16, 2016
కాజల్ కెరీర్ స్లో అయిపోయిందనుకున్న టైంలో ఒక్కసారిగా ఆమె కెరీర్ గేర్ మారి స్పీడ్ పెరిగిపోయింది. తెలుగులో పవర్ స్టార్, సూపర్ స్టార్లతో ఒకేసారి సినిమాలు చేయడంతో పాటు తమిళంలో స్టార్ హీరోల సరసన కూడా ఆఫర్లు కొట్టేసింది. లేటెస్ట్ గా మెగా కుర్రాడు వరుణ్ తేజ్ సరసన కూడా ఛాన్స్ పట్టేసిందని సమాచారం. టెంపర్ కొద్దిగా బొద్దుగా ఉన్న మిత్రవింద, సర్దార్ సెట్ లో దిగిన ఫోటో చూస్తే మాత్రం బరువు తగ్గిందే అనిపించకమానదు. బహుశా ఒక నాలుగైదు కేజీలు తగ్గిస్తే, యంగ్ లుక్ వస్తుందని ప్లాన్ వేసినట్టుంది. వరుణ్ తేజ్ తో ఫోటో షూట్ కూడా జరిగింది కాబట్టి, అది వర్కవుట్ అయిందనే అనుకోవాలి. కాకపోతే, విగ్రహం నిండుగా ఉంటేనే మన సౌత్ జనాలకు ఇష్టం. మరి ఈ కొత్త అవతారాన్ని మన ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి. కాజల్ పవన్ తో నటించిన సర్దార్ ఏప్రిల్ 8న అవుతుండగా, అదే రోజు వరుణ్ తేజ్ తో సినిమా షూటింగ్ స్టార్ట్ అవుతుండటం విశేషం.