English | Telugu

నాన్నకు ప్రేమతో ప్రీ రివ్యూ రిపోర్ట్

ఎన్టీఆర్ నటించిన నాన్నకు ప్రేమతో సెన్సార్ పూర్తయింది. ఇప్పటికే ఆన్ లైన్ లో టిక్కెట్ విండోల సర్వర్ డౌన్ అయిపొయింది. మూవీ రిలీజ్కి ముందే బోలెడంత హైప్ వచ్చింది. కంటెంట్ లో సంథింగ్ మ్యాటర్ ఉందన్న ఆసక్తి అందరిలోనూ ఉంది. అందుకే టిక్కెట్ల కోసం కొట్లాట కూడా అదే రేంజులో ఉంది. ఇంతకీ సుకుమార్ ఏం చూపించాడు.. ఎన్టీఆర్ ఎలా చేశాడు.. అని అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. అందుకే నాన్న‌కు ప్రేమ‌తో ఎలా వుండబోతుందని ఆరా తీసింది తెలుగువ‌న్‌. మాకు తెలిసిన విశ్వ‌స‌నీయ స‌మాచారం ప్ర‌కారం.. నాన్న‌కు ప్రేమ‌తో ప్రీ రివ్యూ రిపోర్ట్ మీ కోసం:

స్పెయిన్‌లోని ధ‌న‌వంతుల్లో రాజేంద్ర ప్ర‌సాద్‌ ఒక‌డు. ఫ్యాక్ట‌రీలూ, ఆస్తులు.. అపార‌మైన సంప‌ద‌. త‌న‌కు ఇద్ద‌రు కొడుకులు.. ఎన్టీఆర్‌, రాజీవ్ క‌న‌కాల‌. ఎన్టీఆర్‌కి నాన్నంటే ప్రాణం... త‌న జీవితాన్ని హాయిగా ఆస్వాదిస్తాడు. స‌డ‌న్‌గా ఓరోజు రాజేంద్ర‌ప్ర‌సాద్‌ ఆసుప‌త్రిపాల‌వుతాడు. డాక్ట‌ర్లు కూడా ఎంతోకాలం బ‌త‌క‌డు.. అని చెప్పేస్తారు. దాంతో ఎన్టీఆర్‌కి షాక్‌. క‌ళ్ల‌ముందున్న స్వ‌ప్నం కూలిపోతున్న‌ట్టు క‌నిపిస్తుంది. మ‌రో షాక్ ఏంటంటే... నాన్న పేరుమీదున్న కంపెనీల‌న్నీ దివాళా తీయ‌డం.. స‌డ‌న్‌గా.. ఆస్తుల స్థానంలో అప్పులు క‌నిపిస్తాయి. దానికి కార‌ణం... కృష్ణ‌మూర్తి. (జ‌గ‌ప‌తిబాబు). రాజేంద్ర ప్ర‌సాద్‌కి ఆప్త మిత్రుడిగా న‌టించి.. దారుణంగా మోసం చేస్తాడు జెబి. విష‌యం తెలుసుకొన్న ఎన్టీఆర్.. ఎలాగైనా స‌రే - కృష్ణ‌మూర్తి సామ్రాజ్యాన్ని నాశ‌నం చేస్తాన‌ని తండ్రికి మాటిస్తాడు. అందులో భాగంగా కృష్ణ‌మూర్తి కూతురు.. ర‌కుల్‌ని ప్రేమ‌లో ప‌డేస్తాడు. ర‌కుల్ స‌హాయంతో.. కృష్ణ‌మూర్తి సామ్రాజ్యంలోకి అడుగుపెడ‌తాడు. అక్క‌డ‌.. ఎన్టీఆర్ ఏం చేశాడు.? త‌న ప‌గ ఎలా సాధించుకొన్నాడ‌న్న‌దే క‌థ‌. ఎమోష‌న్స్ అంటే తెలియ‌ని మ‌నిషిగా.. కేవ‌లం మైండ్ గేమ్‌తోనే ఎలాంటి స‌మ‌స్యనైనా ఎదుర్కొనే చాణిక్యుడిలా ఎన్టీఆర్ పాత్ర‌ని తీర్చిదిద్దాడ‌ట సుకుమార్‌.

ఎన్టీఆర్ పాత్ర చిత్ర‌ణే ఈ సినిమాకి అత్యంత పెద్ద హైలెట్ అని తెలుస్తోంది. సాధార‌ణంగా సుకుమార్ సినిమాల్లో హీరోలు చిత్ర‌విచిత్రంగా బిహేవ్ చేస్తుంటారు. ఈ సినిమాలోనూ ఎన్టీఆర్ పాత్ర అలానే డిజైన్ చేశాడ‌ట సుకుమార్‌. స‌ర‌దాగా మాట్లాడుతూ మాట్లాడుతూ సీరియ‌స్ అయిపోతాడ‌ట‌. ఎప్పుడో జ‌రిగిన గొడ‌వ గుర్తొచ్చి.. వాడ్ని వెదికి ప‌ట్టుకొని మ‌రీ కొడ‌తాడ‌ట‌. అలాంటి వెరైటీ సీన్లు ఈ సినిమా నిండా ఉన్నాయ‌ట‌.

* తండ్రీ కొడుకుల సెంటిమెంట్ అని చెబుతున్నా.. ఫాద‌ర్‌తో సీన్లు కొన్నే ఉంటాయ‌ట‌. విల‌న్ పాత్ర‌ధారి జ‌గ‌ప‌తిబాబుకీ - ఎన్టీఆర్‌కి మ‌ద్య నడిచే స‌న్నివేశాలు ఈ సినిమాకి మేజ‌ర్ హైలెట్‌.

* మైండ్ గేమ్ ఆధారంగా న‌డిచే సినిమా ఇది. మైండ్ గేమ్‌తో జ‌గ‌ప‌తిబాబుని ఎన్టీఆర్ ఎదుర్కొనే స‌న్నివేశాల‌న్నీ బాగా వ‌చ్చాయ‌ట‌.

* తాగుబోతు ర‌మేష్ పాత్ర వెరైటీగా సాగుతుంద‌ని స‌మాచారం

* ప‌తాక స‌న్నివేశాల‌కు అర‌గంట ముందు ఈ సినిమా ఓ రేంజులో ఉంటుంద‌ట‌. ఓ సీన్ దాదాపుగా 4 నిమిషాల‌కుపైగానే సాగుతుంద‌ట‌. అందులో ఎన్టీఆర్ ఎమోష‌న‌ల్ డైలాగులు ప‌లికే విధానం సింప్లీ సూప‌ర్బ్ అని తెలుస్తోంది.

* యాక్ష‌న్ ఎపిసోడ్‌ని తీర్చిదిద్దిన విధానం కూడా వెరైటీగా సాగింద‌ని, ఓ ఫైట్‌లో ఎన్టీఆర్ డైలాగులు చెబుతూ.. రౌడీల‌నుకొట్టే స‌న్నివేశం బాగా టేక‌ప్ చేశార‌ని తెలుస్తోంది.

* ద్వితీయార్థం కాస్త డ‌ల్ అవ్వ‌డం... ఒక్క‌టే కాస్త ఇబ్బంది పెట్టింద‌ట‌. అలాగే ఈ సినిమా క్లాస్ ఆడియన్స్ ఎక్కువగా నచ్చుతుందని..మాస్ ని ఆకట్టుకుందా? లేదా? అనేది భయం చిత్ర యూనిట్ లో నెలకొని వుందట. మాస్ కూడా ఈ సినిమాకి ఓటు వేస్తే నాన్న‌కు ప్రేమ‌తో ఈ సంక్రాంతి విజేత‌గా నిల‌వ‌డం ఖాయమని అంటున్నారు.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.