English | Telugu

నాన్నకు ప్రేమతో సెన్సార్ రిపోర్ట్

యంగ్ టైగర్ నాన్నకు ప్రేమతో మూవీకి సెన్సార్ కూడా పూర్తయిపోయింది. నాన్నకు ప్రేమతో మూవీ చూసిన సెన్సార్ సభ్యులు.. ఈ చిత్రానికి యూ/ఏ సర్టిఫికేట్ ఇచ్చేశారు. దీంతో ఇక 13న రిలీజ్ కు రెడీగా వుంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ చేసిన హాస్పిటల్ సీన్ హైలైట్ అంట .ఆ సమయంలో ఎన్టీఆర్, ముందుగా నవ్వడం..తండ్రి ఎప్పుడూ నవ్వుతూనే వుండాలని చెప్పాడంటూ, ఆపై మళ్లీ కన్నీళ్లు పెట్టుకోవడం..ఈ సీనంతా ఎన్టీఆర్ అద్భుతంగా చేసాడట. మొత్తానికి యంగ్ టైగర్ సంక్రాంతికి పండుగకు వస్తున్నాడా లేదా అనే డౌట్.. ఎవరికైనా ఏమూలైనా ఉంటే వాటిని క్లియర్ చేసేసుకోవచ్చు.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.