Read more!

English | Telugu

నాని సినిమా దాటేసింది..!!

భలే భలే మగాడివోయ్ తర్వాత నాని రేంజ్ మారిపోయింది. ఆ సినిమా నానికి ఓవర్సీస్ లో విపరీతమైన మార్కెట్ ను తెచ్చిపెట్టింది. ఆ మార్కెట్ ఇప్పుడు కృష్ణగాడి వీర ప్రేమగాథకు కూడా కంటిన్యూ అవుతోంది. ఓవర్సీస్ లో ఇప్పటికే హాఫ్ మిలియన్ మార్క్ ను కంఫర్టబుల్ గా దాటేసిన కృష్ణ గాడు, వచ్చేవారంలో కూడా అక్కడి బాక్సాఫీస్ ను కొల్లగొడతాడని ట్రేడ్ వర్గాల అంచనా. రిలీజైన సినిమాలన్నీ యావరేజ్ టాక్ తెచ్చుకోవడంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఇప్పుడు ఇదే పెద్ద సినిమాగా మారింది. మరో పక్క విజయయాత్ర పేరుతో మూవీ రిలీజైన తర్వాత కూడా ప్రమోషన్ చేస్తుండటం, సినిమా రన్ కు ప్లస్ అవుతోంది. కథ,కథనం, నాని పెర్ఫామెన్స్, హను రాఘవపూడి దర్శకత్వం సినిమాకు మెయిన్ హైలైట్స్ గా చెప్పుకోవచ్చు. నాని, మెహరీన్ జంటగా నటించిన ఈ సినిమాను 14 రీల్స్ సంస్థ తెరకెక్కించింది.