English | Telugu

మాట్లాడేది మన బాలయ్యేనా?

నందమూరి బాలకృష్ణ..నటనలో 40 ఏళ్ల అనుభవం, ఎన్నో ఎత్తుపల్లాలు చూసిన ఈ టాలీవుడ్ అగ్రనటుడి నోటి వెంట తత్వశాస్త్రం వచ్చింది. తన 100వ సినిమా గౌతమిపుత్ర శాతకర్ణి సినిమా ప్రారంభోత్సవం హైదరాబాద్ అన్నపూర్ణా స్టూడియోస్‌లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ముఖ్యఅతిథిగా హాజరై బాలకృష్ణను ఆశీర్వదించారు. అనంతరం అభిమానులతో మాట్లాడిన నటసింహ నీకు నువ్వు నచ్చితే ఏం చేసినా బాధపడాల్సిన అవసరం లేదన్నారు. అలాగే నీకు నువ్వు నచ్చనప్పుడు జీవితంలో ఏం సాధించినా ఉపయోగం లేదని చెప్పారు. నీకు నువ్వు నచ్చినపుడు ఏం చేసినా బాధపడాల్సిన అవసరం లేదని, ఎవరి మెహర్బానీ కోసం పాకులాడాల్సిన అవసరం లేదన్నారు. సినిమాల్లోనూ, స్టేజ్ మీద బాలయ్య కనిపిస్తే చాలు పవర్‌ఫుల్ డైలాగ్స్‌తో కనువిందుచేస్తారు బాలయ్య . అందుకు భిన్నంగా ఇవాళ మాట్లాడేసరికి ఫ్యాన్స్ మాట్లాడేది మన బాలయ్యేనా? అని ఆశ్చర్యపోయారు. ఏదైనా జీవితం తనకు నేర్పిన పాఠం..వయసు మీద పడుతుండటంతో బాలయ్య కాస్త హుందాగా వ్యవహరిస్తున్నారు.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.