English | Telugu
బాలయ్య, శాతకర్ణి ఒకే టైప్ అట..!
Updated : Apr 22, 2016
శాతకర్ణి ప్రారంభోత్సవంలో బాలయ్య స్పీచ్ ఆసక్తికరంగా సాగింది. తానూ, శాతకర్ణి ఒకే తరహా వాళ్లమని ఆయన చెప్పడం ఆహూతుల్లో ఆసక్తిని కలిగించింది. " గౌతమీ పుత్ర శాతకర్ణి సినిమా చేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను. నాకూ శాతకర్ణికి పోలికలున్నాయి. అనుకున్నది చేసేయడం, ఒక ఆశయం కోసం ఆవేశంగా కష్టడేవాడు శాతకర్ణి. నేనూ అంతే. ఆశయం లేకపోయినా, ఆవేశం లేకపోయినా అ వ్యక్తి మనిషి కాదు. నాకు నేను నచ్చకుండా, ఇంకొకరికి నచ్చేలా ఉండే లాభం లేదు. శాతకర్ణి ప్రత్యర్ధులకు రెండే ఆప్షన్స్ ఇచ్చేవారు. ఒకటి లొంగిపోవడం లేదా మరణం. అందుకే ఆయన భారతదేశాన్ని ఏకఛత్రాధిపత్యంగా పాలించగలిగారు. 1973లో నాన్నగారు నా నుదుట తిలకం దిద్దినప్పటి నుంచీ నేటి వరకూ నా 43 ఏళ్ల కెరీర్ అద్భుతంగా సాగింది. భవిష్యత్తులో కూడా సాగుతుంది. తెలుగుప్రేక్షకులందరికీ మా ఈ గౌతమీ పుత్ర శాతకర్ణి అంకితం " అన్నారు బాలయ్య.