English | Telugu
బాలకృష్ణ 100వ చిత్రం గౌతమిపుత్ర శాతకర్ణి ఫస్ట్ లుక్
Updated : Apr 8, 2016
ఉగాది సందర్భంగా నటసింహ నందమూరి బాలకృష్ణ హీరోగా క్రిష్ దర్శకత్వంలో ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో 100 చిత్రం అనౌన్స్ మెంట్ చేశారు. ఈ సందర్భంగా...నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ ‘’నా వందో సినిమా ఏదై ఉంటుందా అని ఎదురుచూస్తున్న అభిమానులకు ఉగాది కానుక ఇస్తున్నా.. వందవ చిత్రంగా గౌతమీపుత్ర శాతకర్ణి సినిమా చేస్తున్నానన్నారు. నా 99 సినిమాల కృషే నా 100వ సినిమా. అలాగే 99 మైలురాళ్ళు దాటిన 40 ఏళ్ల అనుభవమే ఈ చిత్రం.
మన తెలుగు వారందరూ తెలుసుకోవాల్సిన వ్యక్తి గౌతమీ పుత్ర శాతకర్ణి. భారతదేశానంతటినీ ఏకచత్రాధిపత్యం క్రింద పాలించిన చక్రవర్తి. ఆయన పాత్రలో నేను నటించనుండటం అదృష్టం. నాన్నగారు కూడా ఆరు నెలలు పాటు ఈ స్క్రిప్ట్ పై కూర్చున్నారని నాకు కొత్తగా తెలిసింది. అయితే సినిమాను చేయలేకపోయారు. గౌతమీపుత్ర శాతకర్ణి శాంతి కోసమే యుద్ధం చేశారు. మరాఠి వీరుడు చత్రపతి శివాజీ సహా అందరికీ ఆదర్శవంతంగా నిలిచిచారు. బాలకృష్ణ సినిమాలో ప్రేక్షకులు ఏ ఎలిమెంట్స్ ఉండాలని కోరుకుంటారో ఆ ఎలిమెంట్స్ అన్నీ ఈ చిత్రంలో ఉంటాయన్నారు. ఇలాంటి చిత్రం చేస్తున్నానంటే అందుకు నా దైవం, మా నాన్నగారు ఆశీర్వాదమే కారణమన్నారు. గౌతమిపుత్ర శాతకర్ణి నవరసాలు ఉండే చిత్రం అవుతుందని బాలకృష్ణ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో చిత్ర టైటిల్ లోగోను విడుదల చేశారు.