English | Telugu
ఆర్ ఎఫ్ సి లో బాలకృష్ణ, సలోని ఆట, పాట
Updated : Mar 13, 2011
యువరత్న బాలకృష్ణ మొన్నటి వరకూ ఈ చిత్రంలోని కొన్ని సీన్లలో వైజాగ్ లోనూ, అరకు లోయలో కొన్ని యాక్షన్ సీన్లలోనూ నటించారు. అక్కడ బాలకృష్ణ సరసన లక్ష్మీరాయ్ కూడా హీరోయిన్ గా నటించింది. ఈ చిత్రంలో బాలకృష్ణ సరసన సలోనీ, లక్ష్మీరాయ్ కాక మరో ఇద్దరు హీరోయిన్లు కూడా నటిస్తారని తెలిసింది. ఈ చిత్రంలో బాలకృష్ణ తాతగా, తండ్రిగా, మనవడిగా ఇలా మూడు విభిన్నమైన పాత్రల్లో నటిస్తున్నారు.
తాత దయా దాక్షిణ్యాలు లేని ఫ్యాక్షనిస్టయితే, తండ్రి పరమ శాంత మూర్తి, మనవడు తెలివైన జర్ణలిస్టు ఇలా ఆ మూడు పాత్రలూ సాగుతాయని ఫిలిం నగర్ వర్గాల కథనం. ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది.