English | Telugu

నాగ్ భక్తిరస చిత్రంలో మెగా హీరోయిన్

మెగా హీరో వరుణ్ తేజ్ సరసన "కంచె" మూవీలో నటించిన ప్రగ్యా జైస్వాల్‌కు గోల్డెన్ ఛాన్స్ వచ్చింది. అది కూడా ఏకంగా టాలీవుడ్ కింగ్ నాగార్జున పక్కన నటించే లక్కీ చాన్స్. "మిర్చి లాంటి కుర్రాడు" సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైన ప్రగ్యా జైస్వాల్‌కు "కంచె" ద్వారా పాపులారిటీ వచ్చింది. ఆ సినిమాలో తన అందంతో, అభినయంతో అటు ప్రేక్షకులను, విమర్శకులను ఆకట్టుకుంది. దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు, నాగార్జున కాంభినేషన్‌లో రానున్న భక్తిరస చిత్రంలో ప్రగ్యాను ఎంపిక చేసినట్లు ఫిల్మ్‌నగర్ టాక్. అయితే ఇంకా అధికారికంగా ఎటువంటి ప్రకటన రాలేదు. శ్రీవెంకటేశ్వరుని పరమ భక్తుడైన హాథీరామ్ బాబా జీవిత చరిత్రతో ఈ చిత్రం రానుంది. ఈ సినిమాలో హాథీరాం బాబాగా నాగార్జున నటించనున్నారు. ప్రజంట్ ఈ మూవీ పోస్ట్ ప్రోడక్షన్ వర్క్ జరుగుతోంది. ఈ చిత్రానికి నమో వెంకటేశాయ అనే పేరును పరిశీలిస్తున్నారు.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.