English | Telugu

నాగ్‌పై రివేంజ్ తీర్చుకుంటానంటున్న శ్రీనువైట్ల..!

శ్రీనువైట్ల..టాలీవుడ్‌లో కామెడీ కమ్ యాక్షన్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్. కడుపుబ్బా నవ్వించే కామెడీతో క్యారెక్టర్స్ సృష్టించి నవ్వుల పువ్వులు పూయిస్తాడు శ్రీను. అలాంటి శ్రీనుకు ఎవరితోనైనా ప్రాబ్లమ్స్ వస్తే వారిని తన సినిమాల్లో టార్గెట్ చేస్తాడు. "దుబాయ్ శ్రీను"లో ఎమ్మెస్ నారాయణ, "కింగ్"లో బ్రహ్మానందం, "బాద్‌షా" లో ఎమ్మెస్ నారాయణ క్యారెక్టర్లలో శ్రీను ఎవరిని టార్గెట్ చేశారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

బ్రూస్‌లీ పరాజయం తర్వాత మెగా హీరో వరుణ్‌తేజ్‌తో ఓ సినిమా తీయబోతున్నాడు శ్రీనువైట్ల. ఈ చిత్రంలో కింగ్ నాగార్జునపై సెటైర్లు వేయనున్నాడు. అఖిల్ సినిమా ఛాన్స్ కోసం నాగ్‌ చుట్టూ తిరిగాడు శ్రీను. అయినా నాగ్ ఒప్పుకోలేదు. దానికి తోడు "కింగ్" సినిమాలో నాగార్జునకి, శ్రీనుకి మధ్య వివాదం చేలరేగినట్టు ఇండస్ట్రీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. వీటన్నింటి ద్వారా తనకు జరిగిన అవమానానికి వరుణ్ ‌తేజ్ సినిమా ద్వారా మన్మథుడిపై పగ తీర్చుకుంటాడని టాక్. నాగ్ లేటేస్ట్ హిట్ మూవీస్ "సోగ్గాడే చిన్నినాయనా", "మనం", "ఊపిరి" చిత్రాలనుగా స్పూఫ్‌గా తీయనున్నాడని సమాచారం.

ఇండియన్ సినిమా హిస్టరీలో ఇలాంటి సినిమా రాలేదు.. మారుతి ఏమంటున్నాడు

రెబల్ సాబ్ ప్రభాస్(Prabhas)పాన్ ఇండియా సిల్వర్ స్క్రీన్ పై తన కట్ అవుట్ కి ఉన్న క్యాపబిలిటీని రాజాసాబ్(The Raja saab)తో మరోసారి చాటి చెప్పాడు. ఇందుకు సాక్ష్యం రాజాసాబ్ తో తొలి రోజు 112 కోట్ల గ్రాస్ ని రాబట్టడమే.  ఈ మేరకు  మేకర్స్ కూడా ఈ విషయాన్ని అధికారకంగా ప్రకటిస్తూ పోస్టర్ ని కూడా రిలీజ్ చేసారు. దీంతో ప్రభాస్ అభిమానుల ఆనందానికి అయితే అవధులు లేవు. చిత్ర బృందం ఈ రోజు రాజా సాబ్ కి సంబంధించిన విజయోత్సవ వేడుకలు నిర్వహించింది. దర్శకుడు మారుతీ తో పాటు, నిర్మాత విశ్వప్రసాద్(TG Vishwa Prasad)రాజా సాబ్ హీరోయిన్స్ నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్ హాజరయ్యారు.

రాజాసాబ్ సర్కస్ 1935 .. సీక్వెల్ కథ ఇదేనా! 

పాన్ ఇండియా ప్రభాస్(Prabhas)అభిమానులు,ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రెబల్ మూవీ 'ది రాజాసాబ్'(The Raja saab)నిన్న బెనిఫిట్ షోస్ తో థియేటర్స్ లో ల్యాండ్ అయ్యింది. దీంతో థియేటర్స్ అన్ని హౌస్ ఫుల్ బోర్డ్స్ తో కళకళలాడుతున్నాయి. సుదీర్ఘ కాలం తర్వాత సిల్వర్ స్క్రీన్ పై వింటేజ్ ప్రభాస్ కనిపించడంతో ఫ్యాన్స్ ఆనందానికి అయితే అవధులు లేవు. రిజల్ట్ విషయంలో మాత్రం మిక్స్డ్ టాక్ వినపడుతుంది. రివ్యూస్ కూడా అదే స్థాయిలో  వస్తున్నాయి. కాకపోతే తెలుగు సినిమా ఆనవాయితీ ప్రకారం ఈ రోజు సెకండ్ షో కంప్లీట్ అయిన తర్వాత గాని అసలైన టాక్ బయటకి రాదు.