English | Telugu

ఎన్టీఆర్, మహేశ్ ఫ్యాన్స్‌కి బ్యాడ్ న్యూస్..!

కొరటాల శివ, జూనియర్ ఎన్టీఆర్ కాంభినేషన్‌లో తెరకెక్కుతున్న మూవీ "జనతా గ్యారేజ్". మిర్చి, శ్రీమంతుడు సినిమాల సూపర్‌హిట్స్‌తో జోరుమీదున్న కొరటాల ఈ సినిమాతో హిట్ కొట్టాలని భావిస్తున్నాడు. నాన్నకు ప్రేమతో తర్వాత ఎన్టీఆర్ నటిస్తున్న సినిమా కావడంతో ఈ మూవీపై భారీ అంచనాలున్నాయి. దీంతో ఈ సినిమాకు సంబంధించిన ఎదో ఒక న్యూస్‌ నెట్‌లో హల్‌చల్ చేస్తోంది. తాజాగా సూపర్‌స్టార్ మహేశ్, ఎన్టీఆర్‌ జనతా గ్యారేజ్ మూవీ ఇంట్రడక్షన్ సీన్‌‌కు వాయిస్ ఓవర్ ఇవ్వనున్నారన్న న్యూస్‌ సోషల్ మీడియాలో షికారు చేస్తోంది. ఇప్పటికే మహేశ్ "బాద్‌షా" సినిమాలో వాయిస్ ఓవర్ ఇవ్వడంతో ఈ వార్తను నిజమని నమ్మారు అభిమానులు. అయితే ఈ వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని చిత్ర యూనిట్ స్పష్టం చేసింది. "జనతా గ్యారేజ్" సినిమాలో ఇంట్రడక్షన్ సీన్‌కీ మహేశ్ తన వాయిస్ ఇవ్వనున్నట్లు వస్తున్న వార్తల్లో ఏమాత్రం నిజం లేదని ఈ మూవీకీ సంబంధించిన అఫీషియల్ వర్గాలు వెల్లడించాయి. అది ఫేక్‌న్యూస్ అని అలాంటిదేమైనా ఉంటే అఫీషియల్‌గా తామే వెల్లడిస్తామని ప్రకటించారు. నిజంగా ఇది మహేశ్, ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కి ఇది బ్యాడ్ న్యూసే.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.