Read more!

English | Telugu

నాగ్ రేంజ్ పెరిగిపోయింది


 

అగ్ర క‌థానాయ‌కుల్లో ఒక‌డిగా ద‌శాబ్దాల నుంచీ ప్ర‌యాణం సాగిస్తున్నాడు అక్కినేని నాగార్జున. నాగ్ కెరీర్ లో హిట్లూ, సూప‌ర్ హిట్లూ చాలా ఉన్నాయి. కానీ న‌వ‌త‌రం అడుగుపెట్టాక‌... వాళ్ల‌కు ధీటుగా నాగ్ వ‌సూళ్లు సాధించ‌లేక‌పోయాడు. నాగ్ సినిమా కనీసం రూ.30 కోట్ల మైలు రాయిని కూడా చేరుకోలేక‌పోయింది. రూ.20 కోట్లు వ‌చ్చాయంటే నాగ్ సూప‌ర్ హిట్ కొట్టిన‌ట్టే. ఈనాటి క్లాసిక్ అనిపించుకొన్న మ‌నం కూడా రూ.30 కోట్ల మైలు రాయి ద‌గ్గ‌రే ఆగిపోయింది. అయితే.. సోగ్గాడే చిన్ని నాయిన మాత్రం నాగార్జున‌లో కొత్త జోష్ నింపింది. ఈ సినిమా ఇప్ప‌టి వ‌ర‌కూ 35 కోట్లు సాధించి.. నాగ్ సినిమాల్లో అత్య‌ధిక వ‌సూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. ఈ సినిమా బ‌డ్జెట్ రూ.15 కోట్ల‌లోపే. అంటే రెట్టింపు లాభాల్ని ఆర్జించింద‌న్న‌మాట‌. సినిమాలో విష‌యం ఉండ‌డం ఒక‌టైతే, సంక్రాంతి బ‌రిలో నిల‌వ‌డం, ఫ్యామిలీ సినిమాగా కితాబులు అందుకోవ‌డం.. సోగ్గాడికి బాగా క‌లిసొచ్చింది. ఈసినిమాతో నాగ్‌.. రేంజ్ అమాంతంగా పెరిగిపోయింది. వ‌రుస ఫ్లాపులు ఎదుర్కొన్న నాగ్‌ని చూసి `నాగ్ ప‌నైపోయింది` అనుకొన్నారంతా. కానీ మ‌నం, సోగ్గాడేతో నాగార్జున ఫామ్‌లోకి వ‌చ్చేశాడు.