English | Telugu

క‌ళావ‌తి రివ్యూ:

దెయ్యం సినిమాల సీజ‌న్ కొన‌సాగుతూనే ఉంది. ఆ మాట‌కొస్తే.. ప్ర‌తీ సీజ‌న్‌లోనూ.. ఈ త‌ర‌హా సినిమాలొస్తూనే ఉన్నాయి. అయితే.. అందులో నిల‌బ‌డేది వంద‌లో ఒక‌టో రెండో? ఆ ఒక సినిమాని చూసి మ‌రో వంద సినిమాలు త‌యార‌వుతున్నాయి. అందులో సీక్వెల్స్ కూడా ఉంటున్నాయి. తాజాగా చంద్ర‌క‌ళ‌కు సీక్వెల్ వ‌చ్చింది. సుంద‌ర్ సి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ చిత్రం.. హార‌ర్ అభిమానుల్ని ఆక‌ట్టుకొంది. అదే న‌మ్మ‌కంతో చంద్ర‌క‌ళ‌కు కొన‌సాగింపుగా క‌ళావ‌తి తీశాడు. మ‌రి చంద్ర‌క‌ళ రేంజులోనే ఈ సినిమా ఉందా? ఆస్థాయిలో ద‌ర్శ‌కుడు భ‌య‌పెట్ట‌గ‌లిగాడా? అస‌లు క‌ళావ‌తికీ, చంద్ర‌క‌ళ‌కూ సంబంధం ఏమిటి? ఈ విష‌యాల‌న్నీ తెలియాలంటే రివ్యూలోకి వెళ్లిపోవాల్సిందే.

ముర‌ళి (సిద్దార్థ్‌) అనిత (త్రిష‌) ప్రేమించి పెళ్లి చేసుకోవాల‌నుకొంటారు. వీళ్లిద్ద‌రూ బ్యాచిల‌ర్ పార్టీల‌తో హంగామా చేస్తున్న త‌రుణంలో ముర‌ళి నాన్న‌గారు ప్ర‌మాద‌వ‌శాత్తూకోమాలోకి వెళ్లిపోయార‌న్న చేదువార్త తెలుస్తుంది. దాంతో రామాపురం వ‌చ్చేస్తాడు ముర‌ళి. ఇంటికి వ‌చ్చిన‌ప్ప‌టి నుంచీ అనుకోని అవాంత‌రాలు, ప్ర‌మాదాలు ఎదుర‌వుతూనే ఉంటాయి. ఓ ఆకారం.. క‌నీక‌నిపించ‌న‌ట్టు క‌నిపించి మాయ‌మైపోతుంటుంది. ఓ సంఘ‌ట‌న‌లో ఇంట్లో ఉన్న ప‌నివాడితో గొడ‌వ పెట్టుకొంటాడు ముర‌ళి. మ‌రుస‌టి రోజు ఆ ప‌నివాడు హ‌త్య‌కు గుర‌వుతాడు. ఆ నేరం.. ముర‌ళిపై ప‌డుతుంది. అనిత అన్న‌య్య ర‌వి (సుంద‌ర్ సి) ఆ ఇంట్లోకి అడుగుపెట్టి.. ఏమైందనే విష‌యాల్ని ఆరా తీస్తాడు. ముర‌ళిని స్టేష‌న్ నుంచి విడిపించుకొస్తాడు. ఆ ఇంట్లో ఏదో దుష్ట శ‌క్తి ఉంద‌న్న విష‌యం అర్థ‌మ‌వుతుంది. సీసీ కెమెరాలో.. ఆ దుష్ట శ‌క్తి మాయ (హ‌న్సిక‌) అని తేలుతుంది. మాయ ఎవ‌రు? ఈ ఇంటిపై ఎందుకు ప‌గ‌బ‌ట్టింది? ఒకొక్క‌రినీ ఎందుకు చంపాల‌నుకొంటుంది? అనే విష‌యాలు సెకండాఫ్‌లో చూడాలి.

దెయ్యాల సినిమాల‌కు పెద్ద‌గా క‌థేం అక్క‌ర్లేద‌న్న నిర్ణ‌యానికి వచ్చేశారు. దానికి అనుగుణంగానే సుంద‌ర్ సి. ఈ స్ర్కిప్టు త‌యారు చేసుకొన్నాడు. చంద్ర‌క‌ళ‌కీ, క‌ళావ‌తి సినిమాకీ ఏమాత్రం సంబంధం ఉండ‌దు. ఆ పేరెందుకు పెట్టారో ద‌ర్శ‌కుడికే తెలియాలి. అయితే.. ఈ సినిమా ప్రారంభ‌మే.. ఒళ్లు జ‌ల‌ద‌రించే సన్నివేశంతో మొద‌లెట్టాడు. దాంతో... థియేట‌ర్లో కూర్చోగానే ఈ సినిమా క‌థ‌లోకి ఆటోమెటిగ్గా వెళ్లిపోతాడు ప్రేక్ష‌కుడు. భ‌య‌పెట్ట‌డానికి టెక్నిక్ ఒక్క‌టే. ఓ రూపాన్ని క‌ళ్ల‌ముందు స‌డ‌న్ గా తీసుకురావ‌డం. ఈ సినిమాలోనూ అదే ఫాలో అయిపోయారు. కాక‌పోతే ఆ రూపం. జుట్టు విర‌బూసుకొని.. వినూత్నంగా ఉండ‌డ‌మే కొత్త‌ద‌నం అనుకోవాలి. మ‌నుషుల్ని గాల్లోలేపి చంప‌డం.. ఈ దెయ్యం క‌నిపెట్టిన కొత్త ప‌ద్ధ‌తి. ఆ స‌న్నివేశాల‌న్నీ సుంద‌ర్ బాగానే తీశాడు. విశ్రాంతి వ‌రకూ థియేట‌ర్లో కూర్చోబెట్టాడు.

ఇంట్ర‌వెల్ త‌ర‌వాత అస‌లు క‌థ మొద‌ల‌వుతుంది. మాయ ఎవరు? అనే విష‌యాన్ని కూడా సుంద‌ర్ బాగానే చూపించాడు. ఆ ఎపిసోడ్ కుటుంబ ప్రేక్ష‌కుల‌కు న‌చ్చేలా ఉంది. అయితే ఫ్లాష్ బ్యాక్ త‌ర‌వాత సినిమా కాస్త స్లో అయ్యింది. ఆత్మ‌ని ఎలా వెళ్ల‌గొట్టాలి? అనే విష‌యంపై మాంత్రికులు చేసే క్షుద్ర‌పూజ‌లు, ఆత్మ ఒక‌రిలోంచి మ‌రొక‌రిలోకి వెళ్లిపోవ‌డం.. ఈ సన్నివేశాలు ప్రేక్ష‌కుల‌కు అంతు బ‌ట్ట‌వు. చివ‌రికి దైవ‌శ‌క్తే దుష్ట‌శ‌క్తిని ఓడించింది అని రొటీన్ గా చెప్పేసి క‌థ ముగించారు.

హ‌న్సిక చుట్టూ తిరిగే క‌థ ఇది. అయితే.. హ‌న్సిక పాత్ర పెద్ద‌గా క‌నిపించ‌దు. ఆ పాత్ర రూపంలో ఉండే ఆత్మ మాత్ర‌మే క‌నిపిస్తుంది. ఆత్మ‌కు రూపం ఎక్క‌డిది? కాబ‌ట్టి హ‌న్సిక ఉన్నా, లేన‌ట్టే. లేక‌పోయినా ఉన్న‌ట్టే. సిద్దార్థ్, త్రిష‌ల‌వి కూడా ప్రాదాన్యం ఉన్న పాత్ర‌లు కావు. సినిమాలో ఉన్న మిగిలిన పాత్ర‌ల‌తో పోలిస్తే సిద్దార్థ్ లెంగ్త్ కాస్త పెద్ద‌దంతే. త్రిష పాత్ర అందాల ఆర‌బోత‌కు ప‌రిమితమైంది. సుంద‌ర్ సి అల‌వాటు ప్ర‌కారం చేసుకొని వెళ్లిపోయాడు. ఆ పాత్ర‌లో తెలుగు ప్రేక్ష‌కుల‌కు తెలిసిన మొహం ఉంటే బాగుండేది. కోవై స‌ర‌ళ అండ్ కో చేసిన కామెడీ. వెగ‌టు పుట్టించింది. పాట‌లు క‌థా గ‌మ‌నానికి అడ్డు త‌గిలాయి. ఇవి రెండూ లేకుండా చూసుకొంటే.. సినిమా స్పీడు స్పీడుగా ఉండేది.

సాంకేతికంగా క్వాలిటీ బాగుంది. సింథిల్ కెమెరాప‌నిత‌నం ఈ సినిమాకి ఓ వ‌న్నె తీసుకొచ్చింది. నేప‌థ్య సంగీతం కూడా ఆక‌ట్టుకొనేలా ఉంది. సుంద‌ర్ సి భ‌య‌పెట్టే సన్నివేశాల‌పైనే ఎక్కువ దృష్టి పెట్టాడు. అది వ‌ర్కువుట్ అయ్యింది. అయితే కామెడీని జొప్పించ‌డం వ‌ల్ల ఆ ఫీల్ త‌గ్గింది.

మొత్తానికి హార‌ర్ చిత్రాలు ఇష్ట‌ప‌డేవాళ్ల‌కు క‌ళావ‌తి న‌చ్చుతుంది. కాక‌పోతే... కామెడీని, అర్థం ప‌ర్థం లేకుండా ప‌డిపోయే పాట‌ల్ని కాస్త ఓర్చుకోవాలంతే.

రేటింగ్:2.5/5

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .