English | Telugu
మాయమైన స్టార్లు @ 2015
Updated : Dec 24, 2015
ఏడాదికి రెండు మూడు సినిమాలు చేసేస్తాం... దుమ్ము దులిపేస్తాం - అని చెప్తుంటారు హీరోలు.కానీ.. ప్రాక్టికాలిటీకి వచ్చేసరికి ఈ మాట నిలబెట్టుకోవడం కష్టం అవుతుంటుంది. కొన్ని కొన్నిసార్లు కథలు దొరకవు. ఇంకొన్ని సార్లు.. వీళ్లకసలు అవకాశాలే రావు. అన్నీ ఉన్నా... సినిమా మొదలవ్వడానికి మీనమేశాలు లెక్కేస్తుంటారు. దాంతో యేడాంతా ఖాళీగానే ఉండిపోవాల్సివస్తోంది. 2015లోనూ కొంతమంది స్టార్లు మాయమైపోయారు. వాళ్ల నుంచి ఒక్క సినిమా కూడా రాకపోవడం విశేషం.
* నాగ్ రాలేదు
2015 నాగ్‌కి అచ్చు రాలేదు. 2014లో మనం లాంటి సూపర్ డూపర్ హిట్ ఇచ్చిన నాగ్.. 2015 లో ఒక్క సినిమానీ విడుదల చేసుకోలేకపోయాడు. అఖిల్ సినిమాతో బిజీగా ఉండడం, స్టూడియో వ్యవహారాలు, మీలో ఎవరు కోటీశ్వరుడు ఈ పోగ్రాంలతోనే గడిపాడు నాగ్. అఖిల్ సినిమాలోని ఓ పాటలో మెరుపులా కనిపించినా.. అక్కినేని అభిమానులకు అది ఆనలేదు. ద అయితే. 2016లో
నాగ్ నుంచి రెండు సినిమాలు గ్యారెంటీగా వచ్చేస్తున్నాయి. సోగ్గాడే చిన్నినాయిన సంక్రాంతి బరిలో నిలిచింది. కార్తితో కలసి నటించిన ఊపిరికి కూడా పిబ్రవరిలో వచ్చేస్తుంది. బ్యాక్ టూ బ్యాక్ మూవీస్‌తో నాగ్ అలరించడం ఖాయం.
* సునీల్ ఏమైపోయాడు
కమెడియన్ నుంచి హీరోగా టర్న్ ఇచ్చుకొన్నాడు సునీల్. సిక్స్ ప్యాక్‌తో హీరోలకు కావల్సిన మెటీరియల్ సంపాదించుకొన్నా... అతని ట్రాక్ మాత్రం అనుకొన్నంత హ్యాపీగా సాగడం లేదు. అందాల రాముడు, మర్యాద రామన్న లాంటి హిట్స్ ఉన్నా.. నిలబెట్టుకోవడంలో, తనకు సరిపడా కథలు ఎంచుకోవడంలో విపలం అవుతున్నాడు. భీమవరం బుల్లోడు తరవాత సునీల్ నటించిన ఒక్క సినిమా కూడా ప్రేక్షకుల ముందుకు రాలేదు. 2015లో సునీల్ అస్సలు కనిపించలేదు. అతను నటించిన కృష్ణాష్టమి పూర్తయినా విడుదలకు నోచుకోలేదు. 2016 ఫిబ్రవరిలో ఈ సినిమా విడుదలయ్యే అకాశాలున్నాయి.
* దర్శకులు ఖాళీ
కొంతమంది దర్శకులు ఈ యేడాది ఒక్క సినిమా కూడా చేయకుండా ఖాళీగా ఉండిపోయారు. శ్రీకాంత్ అడ్డాల, కృష్నవంశీ, నందిని రెడ్డి, సుకుమార్, బోయపాటి శ్రీను, వంశీపైడిపల్లి.. వీళ్ల నుంచి ఒక్క సినిమా కూడా రాలేదు. అయితే వచ్చే యేడాది వీళ్ల సినిమాలన్నీ వరుసకట్టబతోతున్నాయి. సో.. ఆ లోటు కొంత వరకూ తీరొచ్చు.