English | Telugu
కన్నడ పాట పాడిన బుడ్డోడు
Updated : Dec 24, 2015
కన్నడ హీరో పునీత్ రాజ్‌కుమార్ కథానాయకుడిగా నటించే 25వ సినిమా కోసం తెలుగు కథానాయకుడు ఎన్టీఆర్ కన్నడ భాషలో ఒక పాడ పాడేశాడు. సదరు సినిమాకి థమన్ సంగీత దర్శకుడు. ఎన్టీఆర్ తమ చిత్రానికి పాట పాడిన విషయాన్ని థమన్ సోషల్ మీడియా ద్వారా బయటి ప్రపంచానికి వెల్లడిస్తూ, తాను కోరగానే కన్నడ పాట పాడినందుకు ఎన్టీఆర్‌కి థాంక్స్ చెప్పాడు. అలాగే పునీత్ రాజ్‌కుమార్, ఎన్టీఆర్‌తో కలసి దిగిన సెల్ఫీని కూడా పోస్ట్ చేశాడు.