English | Telugu
హాథీరాం బాబా గా నాగార్జున
Updated : Feb 21, 2016
సోగ్గాడే చిన్ని నాయనా సక్సెస్ తో జోష్ మీదున్నారు నాగార్జున. ఇదే ఊపులో దర్శకేంద్రుడు రాఘవేంద్రరావుతో మరో చారిత్రక సినిమాకు సై అన్నారు. సోగ్గాడే కు కొనసాగింపుగా బంగార్రాజు పేరుతో మరో సినిమా వస్తుందని, అంతకు ముందే రాఘవేంద్రరావుతో సినిమా తెరకెక్కబోతోందని ప్రకటించారు నాగార్జున. ఏప్రిల్ మే ల్లో ఈ సినిమా పట్టాలెక్కబోతోందట. కానీ హాథీరాం బాబా సినిమా అని చెప్పకుండా పద్దెనిమిదో శతాబ్దంలో జరిగే కథ అని నాగ్ చెప్పడం విశేషం. ఈ సినిమాను ఎ. మహేష్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఇవే కాక, దిల్ రాజుతో సినిమా ఉండే అవకాశం కూడా ఉంది. దీంతో ఇప్పుడు నాగ్ వరస సినిమాలతో, తీరిక లేని షెడ్యూల్ గడపబోతున్నారు. నిన్న రిలీజైన ఊపిరి టీజర్ మంచి టాక్ సంపాదించుకోవడంతో, సినిమా కోసం నాగ్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ద్విభాషా చిత్రమైన ఊపిరికి తమిళంలో నాగార్జున స్వయంగా డబ్బింగ్ చెప్పుకోవడం విశేషం.