English | Telugu

కిస్ ఆప్ లైఫ్ అంటున్న బాలీవుడ్ ముద్దులవీరుడు

బాలీవుడ్ లో సీరియల్ కిస్సర్ గా, ముద్దుల వీరుడుగా పేరు తెచ్చుకున్నాడు ఇమ్రాన్ హష్మి. అతని సినిమా వచ్చిందంటే చాలు, అందులో ఒక్క కిస్ సీనైనా ఉంటుందనే ముద్ర పడిపోయింది. తాజాగా, జీవితం తనకిచ్చిన ముద్దుల తనయుడి గురించి, తాను ఎదుర్కొన్న కష్టనష్టాలు, బాధల గురించి వివరిస్తూ కిస్ ఆఫ్ లైఫ్ అంటూ పుస్తకాన్ని రాశాడు. తొమ్మిదేళ్ల క్రితం ఇమ్రాన్ హష్మికి పర్వీన్ సహానీతో పెళ్లి జరిగింది. వీరికి అయాన్ అనే కొడుకున్నాడు.

కొడుకు పుట్టాడన్న సంబరాలు ఇమ్రాన్ జంటకు ఎక్కువ కాలం నిలవలేదు. అయాన్ కు క్యాన్సర్ వచ్చిందన్న విషయం తెలిసి తల్లడిల్లిపోయాడు. ఎలాగోలా తన బిడ్డను దాని బారి నుంచి కాపాడుకోగలిగాడు. అందుకే క్యాన్సర్ ను జయించిన తన కొడుకు గురించి ముఖ్యంగా ప్రస్తావిస్తూ, " ద కిస్ ఆఫ్ లైఫ్, హౌ ఎ సూపర్ హీరో అండ్ మై సన్ డిఫీటెడ్ క్యాన్సర్ " అని పేరు పెట్టాడు. ఈ ఏడాది చివరికల్లా, మార్కెట్ లో అందుబాటులోకి రానుందీ పుస్తకం. ప్రస్తుతం అజారుద్దీన్ జీవితకథతో తెరకెక్కుతున్న అజార్ సినిమాలో నటిస్తున్నాడు ఇమ్రాన్.

రూమర్స్ కి చెక్.. ఉస్తాద్ భగత్ సింగ్ గురించి మొత్తం చెప్పేసింది

సిల్వర్ స్క్రీన్ పై పవర్ స్టార్ 'పవన్ కళ్యాణ్'(Pawan Kalyan)స్టామినాని మరింతగా ఎలివేట్ చెయ్యబోతున్న చిత్రం 'ఉస్తాద్ భగత్ సింగ్'(Ustaad.ఇప్పటి వరకు రిలీజైన ప్రచార చిత్రాల ద్వారా ఆ విషయం అర్ధమవుతుండటంతో పాటు దర్శకుడు హరీష్ శంకర్ కూడా ఆ విషయంలో అభిమానులకి, ఫ్యాన్స్ కి పూర్తి భరోసాని ఇస్తున్నాడు. వచ్చే ఏడాది వేసవికి థియేటర్స్ లో అడుగుపెట్టే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ సినిమా గురించి ప్రముఖ హీరోయిన్ సాక్షి వైద్య చెప్పిన కొన్ని విషయాల ద్వారా ఎప్పట్నుంచో సినీ సర్కిల్స్ లో దర్జాగా చక్కర్లు కొడుతున్న ఒక పుకారు కి  పుల్ స్టాప్ పడినట్లయింది.