English | Telugu

' ప్రేమమ్ ' లో నాగ్ వాయిస్ ఉంటుందా..?

మనం, సోగ్గాడే చిన్నినాయనా, ఊపిరి లాంటి వరస సూపర్ హిట్స్ తో హ్యాట్రిక్ కొట్టి ఊపుమీదున్నారు కింగ్ నాగార్జున. తర్వాత దర్శకేంద్రుడు రాఘవేంద్రరావుతో హాథీరాం బాబా సినిమాను తెరకెక్కించే పనిలో ఉన్న నాగ్ కు, కొడుకుల్ని ఇంకా సెటిల్ చేయలేదన్న ఫీలింగ్ మాత్రం అలాగే ఉంది. సరైన కమర్షియల్ హిట్ లేక నాగచైతన్య, ఫస్ట్ సినిమాయే డిజాస్టర్ అయిన అఖిల్, ఇలా ఇద్దరి కెరీర్లూ చాలా డల్ గా సాగుతున్నాయి. ఎలాగైనా ముందు కొడుకుల్ని పుష్ చేయాలని ఫిక్సయిన కింగ్, వాళ్లకోసం తనకు హిట్స్ ఇచ్చిన డైరెక్టర్స్ ను లాక్ చేసి పెట్టారు కూడా.

తాజాగా పెద్ద తనయుడు హీరోగా తెరకెక్కుతున్న రీమేక్ ప్రేమమ్ కు నాగ్ వాయిస్ ఇస్తారని, సినిమాలో కూడా కాసేపు కనిపించి అలరిస్తారనే వార్తలు ఫిల్మ్ నగర్లో వినిపిస్తున్నాయి. గతంలో వెంకటేష్ ప్రేమమ్ రీమేక్ లో నాగచైతన్య మావయ్యగా కనిపిస్తారనే ప్రచారం జరిగింది. కానీ అవి వాస్తవం కాలేదు. ఇప్పుడు నాగార్జున నటిస్తున్నారని వస్తున్న పుకార్లలో ఎంత వరకూ నిజం ఉందో పక్కన పెడితే, నాగార్జున వాయిస్ లేదా కామియో, మూవీకి డెఫినిట్ గా హెల్ప్ అవుతాయనడంలో డౌట్ లేదు. మళయాళంలో సంచలనం సృష్టించిన ప్రేమమ్ ను తెలుగులో అదే పేరుతో తెరకెక్కిస్తున్నారు. చందూ మొండేటి దర్శకత్వం వహిస్తుండగా, సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. రీసెంట్ గానే మూవీలో నాగచైతన్య పెళ్లి సీన్ ను తెరకెక్కించిన సంగతి తెలిసిందే.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.