English | Telugu

ఇప్పటి వరకూ సరైనోడే సరైన హిట్టా..?

ఇప్పటి వరకూ 2016లో వచ్చిన తెలుగు సినిమాల్లో సంక్రాంతి రేస్ లో యాభై కోట్లకు పైగా కుమ్మేసుకున్న సోగ్గాడే చిన్ని నాయనా, నాన్నకు ప్రేమతో సినిమాలే భారీ హిట్లు. లేటెస్ట్ గా ఫ్లాప్ టాక్ తో మొదలైన సరైనోడు ఈ రెండు సినిమాల్ని కొడుతుందని ఎవరూ అనుకోలేదు. కానీ అదే జరిగింది. ఈ ఏడాది వచ్చిన తెలుగు సినిమాల్లో బిగ్గెస్ట్ హిట్ గా సరైనోడు నిలిచింది. స్టైలిష్ స్టార్ స్టైల్ కు, మాస్ డైరెక్టర్ బోయపాటి మాస్ తోడవడంతో, సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది సరైనోడు. పదిరోజుల్లోనే 53 కోట్లకు పైగా వసూలు చేసిన సరైనోడు, 60 కోట్ల క్లబ్ వైపు శరవేగంగా దూసుకెళ్తోంది. మొదటి రోజు వచ్చిన డివైడ్ టాక్ కు, సినిమా బ్రేక్ ఈవెన్ కూడా కష్టమే అని అంచనా వేశాయి ట్రేడ్ వర్గాలు. కానీ సరైన పోటీ లేకపోవడం, మూవీ టీం ప్రమోషన్ల జోరు పెంచడం మూవీకి బాగా ప్లస్సయింది. బ్రహ్మోత్సవం వచ్చే వరకూ సూర్య సినిమా తప్పితే, సరైనోడికి పెద్ద పోటీ లేదు. ఈ నెల 13న మళయాళంలో కూడా సినిమాను రిలీజ్ చేస్తున్నాడు బన్నీ. మరి 60 కోట్ల క్లబ్బును దాటేస్తాడా, లేదో చూడాలి.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.